అయోధ్య: ప్రముఖ నటుడు రజినీకాంత్ అయోధ్యలోని హనుమాన్ గర్హి ఆలయాన్ని సందర్శించారు. అక్కడ హనుమంతుడిని దర్శించుకుని ప్రత్యేక ప్రార్థనలు చేశారు. ఈ సందర్భంగా ఆలయ అర్చకులు రజినీకాంత్ నుదుట తిలకం దిద్ది, ఆయన మెడలో గులాబీల మాల వేశారు. పూజల అనంతరం ఆయన ఆలయం బయటికి వచ్చి మీడియాతో మాట్లాడారు.
హనుమాన్ గర్హి ఆలయంలో హనుమంతుడిని దర్శనం చేసుకోవడం తన అదృష్టమని, తాను చాలా అదృష్టవంతుడినని రజినీకాంత్ వ్యాఖ్యానించారు. తాను ఎప్పుడూ హనుమాన్ గర్హికి వచ్చి హనుమంతుడిని దర్శించుకోవాలని కోరుకుంటూ ఉంటానని రజినీ తెలిపారు. అంతకుముందు రజినీకాంత్ ఉత్తరప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి అఖిలేష్ యాదవ్‌ను కలిశారు.
#WATCH | Uttar Pradesh | Actor Rajinikanth offers prayers at Hanumangarhi temple in Ayodhya. pic.twitter.com/OXoLM8bNA7
— ANI (@ANI) August 20, 2023