తొర్రూరు, జూన్8: ఉదయాన్నే ఉపాధి హమీ పనికి వెళ్లి పని ముగించుకున్న దంపతులు వివా హానికి హజరయ్యేందుకు వెళ్తుండగా వారిని లారీ రూపంలో మృత్యువు వెంటాడింది. ఈ ఘటన తొర్రూరు మండలం నాంచారిమడూర్ గ్రామ శివారులోని ఖమ్మం-వరంగల్ జాతీయ రహదా రిపై చోటు చేసుకుంది. ఎస్ఐ గండ్రాతి సతీశ్ తెలి పిన వివరాల ప్రకారం.. మండలంలోని జామ్లా తండాకు చెందిన కూలీ దంపతులు భూక్యా స్వామి(50), కాంతమ్మ (45) రోజు వారీగా తండాలో ఉపాధి హామీ పనికి వెళ్లారు.
ఆ పని ముగించుకొని తొర్రూరు శివారులోని రామ ఉపేందర్ ఫంక్షన్ హాల్లో జరుగనున్న తండాకు చెందిన సోమ్లా నాయక్ కుమార్తె వివాహానికి హా జరయ్యేందుకు ద్విచక్రవాహనంపై బయలుదేరా రు. ఎస్సారెస్పీ కాల్వ దాటాక వరంగల్ వైపు వేగంగా దూసుకొస్తున్న చేపల లోడు లారీ ఢీకొ ట్టింది. రక్తపు మడుగులో కొట్టుమిట్టాడుతున్న దంపతులు రోడ్డుకు చెరోవైపు పడ్డారు. స్థానికులు పరిశీలించే సమయానికే వారి ప్రాణాలు గాల్లో కలి శాయి. లారీ అక్కడ నుంచి దూసుకుపోయింది.
మృతులకు ఇద్దరు కుమార్తెలు, ఒక కుమారుడు ఉన్నారు. అందరికీ వివాహాలయ్యాయి. ఘటనా స్థలానికి సీఐ సత్యనారాయణ, ఎస్సై రాజు చేరు కొని వివరాలు నమోదు చేసుకున్నారు. దంపతు లను ఢీకొట్టిన తప్పించుకున్న లారీని పోలీసులు వర్థన్నపేట శివారలో పట్టుకున్నారు. మృతదేహా లను మహబూబాబాద్ ఏరియా ఆస్పత్రి మార్చు రీకి తరలించారు. కుమారుడు దేవేందర్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు ఎస్సై తెలిపారు.