మృగశిర సందర్భంగా బుధవారం చేపల కొనుగోళ్లతో మార్కెట్లన్నీ సందడిగా కనిపించాయి. కార్తె నాడు చేపలు తినడం ఆనవాయితీ కాగా.. ఆరోగ్యానికీ మేలు చేస్తుంది. అందుకే మత్స్యకారులు, వ్యాపారులు మార్కెట్లతో పాటు ప్రధాన రోడ్లపై తీరొక్క రకాల చేపలను కుప్పలుతెప్పలుగా తీసుకొచ్చారు. ఉదయం నుంచి టెంట్లు వేసి మరీ విక్రయించగా కొనేందుకు జనం క్యూకట్టాల్సి వచ్చింది. అటు చెరువులు, కుంటల వద్ద మత్స్యకారులు అప్పుడే పట్టిన చేపలను కుప్పలుగా పోసి అక్కడికక్కడే అమ్మేశారు. ఇలా ఉమ్మడి వరంగల్లో ఎక్కడచూసినా మీనరాశులే కనిపించాయి.
– నమస్తే నెట్వర్క్