హైదరాబాద్, జూన్ 19 (నమస్తే తెలంగాణ): కనీస వేతనాల చట్టం-1948 రద్దయి దాని స్థానంలో వేతనాల కోడ్ -2019 అమల్లోకి వచ్చిన నేపథ్యంలో గతంలో వేతన ఉత్తర్వులను గెజిట్లో ప్రచురించాలంటూ ఇచ్చిన ఉత్తర్వులను సమీక్షించడానికి హైకోర్టు అనుమతించింది. గెజిట్లను 4 వారాల్లో ప్రచురించాలన్న ఉత్తర్వులను సమీక్షించాలన్న ప్రభు త్వ పిటిషన్ను అనుమతించింది. గత ఉత్తర్వులను అమలు చేయకపోవడంపై కార్మికసంఘం దాఖలు చేసిన కోర్టు ధికరణ పిటిషన్ను కొట్టివేసింది.
ఈ మేరకు జస్టిస్ నగేశ్ భీమపాక శుక్రవారం ఉత్తర్వులు జారీచేశారు. 1948నాటి కనీస వేతనాల చట్టాన్ని రద్దు చేసి దాని స్థానంలో గత ఏడాది నవంబరు నుంచి అమల్లోకి వచ్చిన 2019 వేతనాల నియమావళి నేపథ్యంలో గత ఉత్తర్వులను పునఃసమీక్షించాలన్న ప్రభుత్వ పిటిషన్ను అనుమతిస్తూ ఉత్తర్వులు జారీచేశారు. 2024లో గెజిట్లో ప్రచురించాలన్న ఉత్తర్వులు జారీ చేసినపుడు కొత్త చట్టం ప్రస్తావన తీసుకురాలేదన్న ప్రభుత్వ వాదన నేపథ్యంలో ఈ ఉత్తర్వులు జారీ చేస్తున్నట్టు తెలిపారు.