హైదరాబాద్, ఆట ప్రతినిధి: దక్షిణాఫ్రికా వేదికగా జరిగే ఫినా ప్రపంచ జూనియర్ చాంపియన్‌షిప్‌లో బరిలోకి దిగే భారత స్విమ్మింగ్ జట్టుకు రాష్ట్ర యువ స్విమ్మర్ వ్రితి అగర్వాల్ ఎంపికైంది. పోర్ట్‌ఎలిజబెత్‌లో ఏప్రిల్ 6 తేదీ నుంచి 11 వరకు దక్షిణాఫ్రికా జాతీయ చాంపియన్‌షిప్ జరుగనుంది. ఇందులో అర్హత సాధించిన స్విమ్మర్లు ఆగస్టులో జరిగే ప్రపంచ జూనియర్ చాంపియన్‌షిప్‌లో పోటీపడుతారు. జాతీయ జట్టుకు ఎంపికైన సందర్భంగా వ్రితి అగర్వాల్‌ను సాట్స్ చైర్మన్ వెంకటేశ్వర్‌రెడ్డి మంగళవారం ప్రత్యేకంగా అభినందించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర స్విమ్మింగ్ అసోసియేషన్ కార్యదర్శి రామకృష్ణ, కోచ్ జాన్ సిద్ధిఖి తదితరులు పాల్గొన్నారు.