Vivo V70 series : చైనాకు చెందిన మొబైల్ తయారీ సంస్థ వివో తాజాగా రెండు వీ70 సిరీస్ ఫోన్లను విడుదల చేసింది. వివో వీ70 ఎలైట్, వీ70 అనే రెండు ఫోన్లు రిలీజయ్యాయి. మంచి కెమెరా కోరుకునే వారిని లక్ష్యంగా చేసుకుని ఈ ఫోన్లను విడుదల చేసింది. కెమెరాలకు ప్రసిద్ధి చెందిన జీస్ బ్రాండ్‌తో ఒప్పందం కుదుర్చుకుని, జీస్ కెమెరాలతో ఈ ఫోన్లను విడుదల చేసింది. రెండు మోడల్స్ వేరే అయినా, డిజైన్ మాత్రం దాదాపు ఒకేలా ఉంటుంది. రెండు మోడల్స్‌పై వివిధ కార్డులపై డిస్కౌంట్స్, ఎక్స్ఛేంచ్ ఆఫర్స్ ఉన్నాయి.
వివో వీ70 ఫీచర్స్
ఆండ్రాయిడ్ 16 ఓఎస్, ఒరిజిన్ ఓఎస్ 6, ఐపీ 68, ఐపీ 69 రేటింగ్, స్నాప్‌డ్రాగన్ 7 జనరేషన్ 4 ప్రాసెసర్, 8జీబీ+256జీబీ, 12జీబీ+256జీబీ, 6,500 ఎంఏహెచ్ లిథియం అయాన్ బ్యాటరీ, 90 వాట్స్ ఫాస్ట్ ఛార్జింగ్ కెపాసిటీ, 194 గ్రాముల బరువు, 3డీ అల్ట్రాసానిక్ ఫింగర్ ప్రింట్ సెన్సర్, 6.59 అంగుళాల అమోలెడ్ డిస్ప్లే, 2750 × 1260 రెజల్యూషన్, 120 హెర్జ్ రిఫ్రెష్ రేట్, 5000 నిట్స్ బ్రైట్నెస్, 2 నానో సిమ్స్, 50 ఎంపీ జీస్ సెల్ఫీ కెమెరా, 50 ఎంపీ రేర్ జీస్ కెమెరా, 50 ఎంపీ ఓఐఎస్ మెయిన్ కెమెరా, 50 ఎంపీ ఓఐఎస్ టెలిఫొటో కెమెరా, 8 ఎంపీ వైడ్ యాంగిల్ కెమెరా, రేర్ ఫ్లాష్, 4కే వీడియో రికార్డింగ్ వంటి ఫీచర్లున్నాయి. ప్యాషన్ రెడ్, లెమన్ యెల్లో కలర్స్‌లో లభిస్తాయి. ఈ మోడల్ ధర రూ.45,999 / రూ.49,999.00.
వీ 70 ఎలైట్
ఆండ్రాయిడ్ 16 ఓఎస్, ఒరిజిన్ ఓఎస్ 6, ఐపీ 68, ఐపీ 69 రేటింగ్, స్నాప్‌డ్రాగన్ 8 జనరేషన్ 3 ప్రాసెసర్, 8జీబీ+256జీబీ, 12జీబీ+256జీబీ, 12జీబీ+512 జీబీ, 6,500 ఎంఏహెచ్ లిథియం అయాన్ బ్యాటరీ, 90 వాట్స్ ఫాస్ట్ ఛార్జింగ్ కెపాసిటీ, 187 గ్రాముల బరువు (అథెంటిక్ బ్లాక్), 194 గ్రాముల బరువు (ప్యాషన్ రెడ్, శాండ్ బీజ్) , 3డీ అల్ట్రాసానిక్ ఫింగర్ ప్రింట్ సెన్సర్, 6.59 అంగుళాల అమోలెడ్ డిస్ప్లే, 2750 × 1260 రెజల్యూషన్, 120 హెర్జ్ రిఫ్రెష్ రేట్, 5000 నిట్స్ బ్రైట్నెస్, 2 నానో సిమ్స్, 50 ఎంపీ జీస్ సెల్ఫీ కెమెరా, 50 ఎంపీ రేర్ జీస్ కెమెరా, 50 ఎంపీ ఓఐఎస్ మెయిన్ కెమెరా, 50 ఎంపీ ఓఐఎస్ టెలిఫొటో కెమెరా, 8 ఎంపీ వైడ్ యాంగిల్ కెమెరా, రేర్ ఫ్లాష్, 4కే వీడియో రికార్డింగ్, బ్లూటూత్ 5.4 వంటి ఫీచర్లున్నాయి. ప్యాషన్ రెడ్, లెమన్ యెల్లో కలర్స్‌లో లభిస్తాయి. ఈ మోడల్ ధర రూ.51,999 / రూ.56,999 / రూ.61,999. ర