కొండాపూర్, జూన్ 29 : డ్రైనేజీ సమస్యలను పరిష్కరించే శేరిలింగంపల్లి జోనల్ కార్యాలయంలోనే మురుగు పరుగులు తీస్తుంది. గత వారం రోజులుగా మురుగు నీరు రోడ్డుపై పారుతున్న అధికారులు పట్టించుకోక పోవడంపై కార్యాలయానికి విచ్చేసి సందర్శకులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు.
జోనల్ పరిధిలోని సమస్యలను పరిష్కరించే అధికార యంత్రాంగం కొలువుదీరే కార్యాలయంలో సమస్యను పరిష్కరించుకోకపోవడంపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఆఫీస్ నే పట్టించుకొని అధికారులు ప్రజల సమస్యలను పట్టించుకుంటారా అంటూ పెదవి విరుస్తున్నారు. అధికారులు ఇకనైనా డ్రైనేజీ సమస్యను పరిష్కరించి పరిష్కారం చూపాలంటూ ప్రజలు కోరుతున్నారు.