భారత దేశంలో డొమినిసియన్ రిపబ్లిక్ రాయబారిగా పనిచేస్తున్న డేవిడ్ పూయిగ్ టీ వర్క్స్‌ను మంగళవారం సందర్శించారు. ఈ సందర్బంగా టీ వర్క్స్‌లో జరుగుతున్న భౌతిక ఆవిష్కరణల నమూనా రూపకల్పన, ఔత్సాహికులను ప్రోత్సహిస్తున్న తీరును టీ వర్క్స్ ప్రతినిధులు ఆయనకు వివరించారు.టీ వర్స్‌లో ఏర్పాటు చేసిన వివిధ రంగాలకు చెందిన యంత్ర పరికరాల ల్యాబొరేటరీని పరిశీలించి, వాటి పనితీరును, ఆవిష్కర్తలకు ఇస్తున్న మద్దతును ప్రత్యక్షంగా తెలుసుకున్నారు.