Viral Video : బటర్ చికెన్ షూస్.. ఈ పేరు ఎప్పుడూ విని ఉండరు కదా. ఎందుకంటే ఒకటి ఫుడ్ అయితే.. ఇంకోటి ఒంటిపై ధరించే యాక్సెసరీ. రెండూ వేర్వేరు. అయితే, ఒక యువతి తన క్రియేటివిటీతో ఈ రెండింటినీ మిక్స్ చేసింది. దీనికి సంబంధించి ఆ యువతి ఇన్‌స్టాగ్రామ్‌లో ఒక వీడియో పోస్ట్ చేసింది. అందులో జూలియట్ అనే యువతి షూస్ కోసం ఒక ట్రాన్స్పరెంట్ బేస్ తయారు చేసింది.
ఇవి హీల్స్ లాగా షూస్ కింది భాగంలో ఉంటాయి. వీటిలో బటర్ చికెన్ నింపింది. తర్వాత ఈ సోల్‌ను పైనుంచి మూసేసింది. తర్వాత వాటిపై తిరిగి షూస్ ఫిక్స్ చేసింది. ఈ షూస్ కింద ఉన్న బేస్‌లోని బటర్ చికెన్ బయటికి రాకుండా జాగ్రత్తగా ఫిక్స్ చేసింది. అంతేకాదు.. తర్వాత ఆ షూస్ ధరించి బయట పార్క్‌కు నడుచుకుంటూ వెళ్లింది. అక్కడ ఒక బెంచీపై కూర్చుని షూస్ తీసి, వాటి అడుగున ఉన్న బేస్‌లోని చికెన్‌ను స్పూన్‌తో తీసుకుని తిన్నది. ప్రస్తుతం ఈ వీడియో ట్రెండ్ అవుతోంది. అయితే, నెటిజన్లు మాత్రం దారుణంగా రియాక్ట్ అవుతున్నారు. తినే ఫుడ్‌ను భారతీయులు అలా కాళ్ల కింద పెట్టుకోరు అని వ్యాఖ్యానిస్తున్నారు.
ఈ వీడియో చూస్తే వాంతులొలస్తున్నాయని, ఈ క్రియేటివిటీ చండాలంగా ఉందని వ్యాఖ్యానిస్తున్నారు. చాలా మంది నెగెటివ్‌గానే స్పందిస్తున్నారు. ఇక.. జూలియట్ అనే ఈ యువతి గతంలో కూడా ఇలాంటి కొన్ని విచిత్రమైన ఫుడ్ క్రియేటివిటీ వీడియోలు చేసింది. ఇంతకీ బటర్ చికెన్ షూస్ ఎలా ఉన్నాయో తెలుసుకునేందుకు వీడియోపై మీరూ ఓ లుక్కేయండి.