ఎర్రుపాలెం, జూన్ 20 : ఖమ్మం జిల్లా ఎర్రుపాలెం మండలంలోని పలు గ్రామ పంచాయతీల ఉప సర్పంచులు శనివారం ఎర్రుపాలెం రైతు వేదికలో సమావేశమై ఉప సర్పంచుల సంఘం మండల కమిటీని ఎన్నుకున్నారు. ఈ సమావేశానికి రాష్ట్ర ఉపాధ్యక్షుడు బందు యాకయ్య, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బానోతు చంద్రశేఖర్, మహబూబాబాద్ జిల్లా అధ్యక్షుడు రాజు, ఖమ్మం జిల్లా అధ్యక్షుడు దరావత్ సుధాకర్ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. సమావేశం అనంతరం జిల్లా అధ్యక్షుడు దరావత్ సుధాకర్ ఆధ్వర్యంలో సఖినవీడు గ్రామ ఉప సర్పంచ్ యరమల విజయభాస్కర్ రెడ్డిని ఉప సర్పంచుల సంఘం ఎర్రుపాలెం మండల అధ్యక్షుడిగా ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. అనంతరం సంఘ కార్యవర్గ సభ్యులను కూడా ఎన్నుకున్నారు.
మండల అధ్యక్షుడిగా ఎన్నికైన విజయభాస్కర్ రెడ్డిని అతిథులు, ఉప సర్పంచులు, ప్రజాప్రతినిధులు అభినందించారు. గ్రామాల అభివృద్ధి, ఉప సర్పంచుల సమస్యల పరిష్కారం, స్థానిక సంస్థల బలోపేతానికి కృషి చేయాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో సంఘ ప్రచార కార్యదర్శి షేక్ షాబాషా, ఉపాధ్యక్షుడు కోట ఆదాం, ప్రధాన కార్యదర్శి రాయల రామచంద్రరావు, సంయుక్త కార్యదర్శి స్వర్ణకుమారి, కార్యవర్గ సభ్యులు కోగంటి భాగ్యమ్మ, రావూరి మల్లికార్జునరావు, నందిగం ప్రభాకర్ రావు, చట్టు పార్వతి, పాముల రోశయ్య, మిరియాల లక్ష్మయ్య పాల్గొన్నారు.