Vijay Sethupathi | కెరీర్ ఆరంభం నుంచి వినూత్న కథాంశాలను ఎంచుకొంటూ విలక్షణ నటుడిగా పేరు తెచ్చుకున్నారు తమిళ అగ్ర నటుడు విజయ్ సేతుపతి. గత ఏడాది ‘మహారాజా’ చిత్రంలో ఆయన అభినయానికి సర్వత్రా ప్రశంసలు దక్కాయి. తాజా సమాచారం ప్రకారం పూరి జగన్నాథ్ దర్శకత్వంలో ఆయన ఓ చిత్రానికి గ్రీన్‌సిగ్నల్ ఇచ్చినట్లు సమాచారం.
పూరి చెప్పిన కాన్సెప్ట్‌లోని కొత్తదనం, తన పాత్రను డిజైన్ చేసిన విధానం నచ్చడంతో విజయ్ సేతుపతి ఈ సినిమాకు వెంటనే అంగీకరించారని చెబుతున్నారు. కథ బాగా ఇంప్రెస్ చేయడంతో వెంటనే ఈ సినిమాను పట్టాలెక్కించాలని ఆయన పూరి జగన్నాథ్‌ను కోరినట్లు వార్తలొస్తున్నాయి. ఈ చిత్రానికి సంబంధించిన అధికారిక ప్రకటన త్వరలో వెలువడుతుందని సమాచారం. ప్రస్తుతం విజయ్ సేతుపతి ‘ట్రెయిన్’ అనే చిత్రంతో పాటు పాండిరాజ్ దర్శకత్వంలో కూడా ఓ సినిమా చేస్తున్నారు.