Seed Ganesha | ప్రముఖ నటుడు విజయ్ దేవరకొండ ‘గ్రీన్ ఇండియా ఛాలెంజ్’ (Green India Challenge)లో బృందం నుంచి ‘సీడ్ గణేశ్’ (విత్తన గణపతి) ప్రతిమను అందుకున్నారు. ఈ సందర్భంగా ఆయన ప్రజలందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు తెలుపుతూ పర్యావరణ పరిరక్షణపై కీలక పిలుపునిచ్చారు.
మన నగరాన్ని కాలుష్యం బారిన పడకుండా కాపాడుకునేందుకు ప్రతి ఒక్కరూ సురక్షితమైన మట్టి విగ్రహాలను, సీడ్ (విత్తన) విగ్రహాలను ఉపయోగించాలని ఆయన కోరారు. పండుగ ముగిసిన తర్వాత ఆ విగ్రహం ద్వారా ఒక మొక్క ఎదుగుతుందని, భక్తితో పాటు ప్రకృతిని కూడా కాపాడుకోవాలని విజయ్ దేవరకొండ పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో భాగంగా గ్రీన్ ఇండియా ఛాలెంజ్ రూపకర్త, మాజీ ఎంపీ జోగినపల్లి సంతోష్ కుమార్ చేపట్టిన ఈ పర్యావరణహిత కార్యక్రమానికి విజయ్ దేవరకొండ మద్దతు తెలిపారు.
కాలుష్యం పెరుగుతున్న ప్రస్తుత పరిస్థితుల్లో మొక్కలు నాటడం కేవలం ఎంపిక కాదని, అది అవసరమని సంతోష్ కుమార్ అభిప్రాయపడ్డారు. మాజీ సీఎం కేసీఆర్ మానస పుత్రికగా పేర్కొనే హరితహారం స్ఫూర్తితో 2018లో ప్రారంభమైన గ్రీన్ ఇండియా ఛాలెంజ్.. మూడు మొక్కలు నాటాలి, వాటిని మూడేళ్లు పెంచాలి, మరో ముగ్గురిని నామినేట్ చేయాలి అనే ఫార్ములాతో కొనసాగుతోంది. ఈ కార్యక్రమం ద్వారా ఇప్పటివరకు 20 కోట్లకు పైగా మొక్కలు నాటినట్లు నిర్వాహకులు వెల్లడించారు. పండుగను కేవలం వేడుకగా కాకుండా పర్యావరణ ఉద్యమంగా మార్చే సీడ్ గణేశా కార్యక్రమాన్ని పౌరులు, హౌసింగ్ సొసైటీలు, ఆలయ కమిటీలు స్వీకరించాలని గ్రీన్ ఇండియా ఛాలెంజ్ కోరుతోంది.
Hero @TheDeverakonda received a Seed Ganesha (Vittana Ganapati) from Green India Challenge team
appealed to all to celebrate Ganesh Chaturthi with eco-friendly Matti Ganapati and Vittana Ganapati.#VijayDeverakonda #SeedGanesha #GreenIndiaChallenge pic.twitter.com/58WTmcBRcX
— Pavan Kumar (@pavankumar__123) September 10, 2026