Vijay Deverakonda apologizes | టాలీవుడ్ సినీ నటుడు విజయ్ దేవరకొండ (Vijay Devarakonda) ఇటీవల చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదమయిన విషయం తెలిసిందే. గత నెల 26న జరిగిన తమిళ హీరో సూర్య నటించిన ‘రెట్రో’ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్లో విజయ్ దేవరకొండ మాట్లాడుతూ.. ట్రైబల్ అనే పదం వాడడు. అయితే ఈ వ్యాఖ్యలు ఆదివాసులను అవమానించేలా ఉన్నాయని ట్రైబల్స్ లాయర్స్ అసోసియేషన్ బాపూనగర్ అధ్యక్షుడు కిషన్రాజ్ చౌహాన్ ఆరోపించడంతో పాటు హైదరాబాద్(Hyderabad)లోని ఎస్ఆర్నగర్ పోలీస్స్టేషన్లో ఫిర్యాదు చేశారు. గిరిజనులను అవమానించేలా మాట్లాడడం దారుణమని, విజయ్ దేవరకొండపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేసి చర్యలు తీసుకోవాలని కోరారు. మరోవైపు ఈ వ్యాఖ్యలను పలు ఆదివాసి సంఘాలు తప్పుబట్టడమే కాకుండా క్షమాపణలు చెప్పాలని కోరాయి.
తాజాగా ఈ వివాదంపై విజయ్ దేవరకొండ క్షమాపణలు తెలుపుతూ ఒక ప్రకటన విడుదల చేశారు. ముఖ్యంగా షెడ్యూల్డ్ తెగల వారిని తాను ఎంతో గౌరవిస్తానని, వారిని దేశంలో అంతర్భాగంగా భావిస్తానని ఆయన స్పష్టం చేశారు. ఎవరినీ బాధపెట్టే లేదా లక్ష్యంగా చేసుకునే ఉద్దేశం తనకు ఏమాత్రం లేదని విజయ్ తేల్చి చెప్పారు. అలాగే దేశం ఐక్యంగా ఉండాలని పిలుపునిచ్చే సమయంలో, తన సోదరుల వలె భావించే భారతీయులలో ఏ ఒక్క వర్గాన్ని కూడా తాను ఉద్దేశపూర్వకంగా ఎలా వేరు చేస్తానని ఆయన ప్రశ్నించారు.
తాను ఉపయోగించిన “ట్రైబ్” అనే పదం చారిత్రక మరియు నిఘంటువు అర్థంను ఉద్దేశించి వాడానని విజయ్ వివరించారు. శతాబ్దాల క్రితం ప్రపంచవ్యాప్తంగా మానవ సమాజం తెగలు, కుటుంబాలుగా ఏర్పడి, తరచుగా సంఘర్షణలు పడే కాలాన్ని సూచించే ఉద్దేశంతో ఆ పదాన్ని ఉపయోగించానని ఆయన అన్నారు. అది వలస వచ్చిన. లేదా స్వాతంత్య్రానంతర భారతదేశంలో 100 సంవత్సరాల క్రితమే అధికారికంగా ఏర్పడిన షెడ్యూల్డ్ తెగల వర్గీకరణను ఉద్దేవించి చేసిన వ్యాఖ్యలు కాదని ఆయన స్పష్టం చేశారు.
ఆంగ్ల డిక్షనరీ ప్రకారం “ట్రైబ్” అంటే: “సామాజిక, ఆర్థిక, మతపరమైన లేదా రక్త సంబంధాలతో ముడిపడి, ఉమ్మడి సంస్కృతి మరియు మాండలికం కలిగిన కుటుంబాలు లేదా సమాజాల సమూహం, ఇది ఒక సాంప్రదాయ సమాజంలో ఒక సామాజిక విభాగం. అని విజయ్ తెలిపారు. తన సందేశంలోని ఏదైనా భాగం అపార్థం చేసుకున్నా లేదా ఎవరినైనా బాధించి ఉన్నా, తాను క్షమాపణలు తెలుపుతున్నానని విజయ్ దేవరకొండ అన్నారు. శాంతి, పురోగతి మరియు ఐక్యత గురించి మాట్లాడటమే తన ఏకైక లక్ష్యమని ఆయన పేర్కొన్నారు. తన వేదికను ప్రజలను ఉన్నతీకరించడానికి మరియు ఐక్యం చేయడానికి ఉపయోగిస్తానని, ఎప్పటికీ విభజించడానికి కాదని ఆయన చెప్పుకోచ్చారు.
To my dear brothers ❤️ pic.twitter.com/QBGQGOjJBL
— Vijay Deverakonda (@TheDeverakonda) May 3, 2025