ఏ ఇంటర్వ్యూకి వెళ్లినా అవమానాలు.. ఇంటర్వ్యూ చేసే వ్యక్తుల నుంచి ఛీత్కారాలు.. మొహం ఎలా ఉందో చూస్కో అంటూ హేలనలు.. వీటన్నింటినీ తట్టుకోలేకపోయాడు. ఏ ఇంటర్వ్యూకి వెళ్లినా తన ప్రతిభను చూడకుండా మొహాన్ని చూసే జాబ్ ఇవ్వట్లేదని కుంగిపోయాడు. తన ముఖంపై తానే విరక్తి చెందాడు. ఎలాగైనా అందంగా మారి తానేంటో నిరూపించుకోవాలని అనుకున్నాడు. అందుకోసం ఒకటి కాదు రెండు కాదు.. ఏకంగా 9 ప్లాస్టిక్ సర్జరీలు చేయించుకున్నాడు. హాలీవుడ్ హీరోలా తయారయ్యాడు వియత్నాంకు చెందిన 26 ఏళ్ల డూ కూయెన్.
డూ కూయెన్ ఏ ఇంటర్వ్యూకి వెళ్లినా అక్కడే అవమానమే ఎదురయ్యేది. ఇంటర్వ్యూ చేసే వ్యక్తులు అతని మొహాన్ని చూసి గేలి చేసేవారు. దీంతో మనస్తాపానికిగా గురైన ఆ యువకుడికి తన మొహంపై అసహ్యం వేసింది. ఎలాగైనా తన ముఖాన్ని అందంగా మార్చుకోవాలని అనుకున్నాడు. ఇందుకోసం కొద్దిరోజులు మేకప్ ఆర్టిస్ట్‌గా పనిచేసి రూ.12 లక్షల వరకు సంపాదించాడు. వాటితో 9 సర్జరీలు చేయించుకున్నాడు. హాలీవుడ్ హీరోలా తయారయ్యాడు.
సర్జరీకి ముందు ఫొటోను, ఇప్పటి ఫొటోను తాజాగా డూ కూయెన్ టిక్‌టాక్‌లో షేర్ చేశాడు. అందులో తాను ఎదుర్కొన్న అవమానాలు, ఛీత్కారాలను వివరించాడు. ఆ రెండు ఫొటోలు చూసిన నెటిజన్లు ఆశ్చర్యపోతున్నారు. అంతెందుకు సర్జరీ తర్వాత తొలిసారి ఇంటికి వెళ్లిన డూని చూసి అతని కుటుంబసభ్యులే గుర్తుపట్టలేకపోయారట. ‘అద్దంలో మనల్ని మనం చూసుకున్నప్పుడు కాన్ఫిడెంట్‌గా.. సంతృప్తిగా అనిపించాలి. అదే నా దృష్టిలో నిజమైన అందం. మిమ్మల్ని కాన్ఫిడెంట్‌గా ఉంచే అందం కోసమే ఎప్పుడూ వెతకండి. ఎల్లప్పుడు దృఢంగా ఉండండి’ అని డూ కూయెన్ చెబుతున్నాడు.