కరువులో కూరగాయల సాగే మేలు
కరువు పరిస్థితుల నేపథ్యంలో తక్కువ సమయంలో మంచి ఆదాయం వచ్చే పంటలను సాగు చేయాలని వ్యవసాయ, ఉద్యానవన నిపుణులు సూచిస్తున్నారు.
- డిసెంబర్లో ఈ పంటలతో ప్రయోజనం
హైదరాబాద్, నవంబర్ 15 (నమస్తే తెలంగాణ) : కరువు పరిస్థితుల నేపథ్యంలో తక్కువ సమయంలో మంచి ఆదాయం వచ్చే పంటలను సాగు చేయాలని వ్యవసాయ, ఉద్యానవన నిపుణులు సూచిస్తున్నారు. డిసెంబర్ నెలలో కూరగాయల సాగు రైతులకు లాభదాయకంగా ఉంటుందని పేరొంటున్నారు. ఈ నెలలో ఉండే చల్లని వాతావరణం, తకువ ఉష్ణోగ్రతలు కొన్నిరకాల కూరగాయల ఎదుగుదలకు అత్యంత అనుకూలంగా ఉంటాయని చెప్తున్నారు.
డిసెంబర్ నెలకు అనువైన పంటలు:
కాలీఫ్లవర్ (ఫూల్ గోబీ): డిసెంబర్ నెలలో సాగుకు కాలీఫ్లవర్ అత్యంత అనుకూలమైన పంట. దీనికి తకువ పెట్టుబడి (ఎకరానికి రూ.50,000 నుండి రూ.60,000) అవసరం. రైతులకు స్టేకింగ్ లేదా మల్చింగ్ వంటి అదనపు ఖర్చులు ఉండవు. తకువ అనుభవం ఉన్న రైతులు లేదా కొత్తగా వ్యవసాయం చేసేవారు కాలీఫ్లవర్ సాగును చేపట్టడం ద్వారా మంచి అనుభవాన్ని, ఆదాయాన్ని పొందవచ్చు. ఈస్ట్ వెస్ట్ దావల్ వంటి రకాలు 1.5 కిలోల వరకు సైజును సాధించగలవని సూచిస్తున్నారు. కాలీఫ్లవర్లా క్యాబేజీ కూడా డిసెంబర్లో సాగుకు అనుకూలం.
టమాటా: చలికాలంలో టమాటా సాగు మంచి ఫలితాలను ఇస్తుంది. సాహో, బాహో వంటి రకాలు మారెట్లో ప్రాచుర్యం పొందాయి. గ్రాఫ్టింగ్ టమాటాను సాగు చేయడం వల్ల దిగుబడి పెరిగి, వ్యాధి నిరోధకత పెరుగుతుంది. ప్రస్తుతం టమాటాకు అధిక ధర ఉన్నప్పటికీ, భవిష్యత్తు ధరల గురించి కచ్చితంగా చెప్పలేం. నేలపైన కూడా సాగు చేయవచ్చు, అయితే స్టేకింగ్ చేసుకోవడం మంచిది.
పచ్చిమిర్చి: నవంబర్ నుంచి ఫిబ్రవరి వరకు పచ్చిమిర్చిని సాగు చేయవచ్చు. రవి హైబ్రిడ్ సీడ్స్, కలాష్ వంటి కంపెనీల రకాలు మంచి దిగుబడిని ఇస్తున్నాయి. పచ్చిమిర్చికి ముడత, వైరస్ రోగాలు వచ్చే అవకాశం ఉన్నందున, సరైన స్ప్రే షెడ్యూల్ గురించి అవగాహన కలిగి ఉండటం ముఖ్యం.
గ్రాఫ్టింగ్ వంకాయ: వంకాయను ఏడాది పొడవునా సాగు చేయవచ్చు. గ్రాఫ్టింగ్ వంకాయ సాగు చేయడం వల్ల రెండు సంవత్సరాల వరకు దిగుబడి పొందవచ్చు. ఇది వ్యాధులను తట్టుకునే శక్తిని కలిగి ఉంటుంది. నారు లభ్యత తకువగా ఉండే అవకాశం ఉన్నందున, ముందుగానే ఆర్డర్ చేసుకోవడం మంచిది.
వేరు కూరగాయలు: ముల్లంగి, బీట్రూట్, క్యారెట్ పంటలకు పెట్టుబడి తకువ. ముల్లంగి 30-40 రోజుల్లో, బీట్రూట్ 60 రోజుల్లో, క్యారెట్ 80-90 రోజుల్లో చేతికి వస్తాయి. ఇసుక పొలాలు లేదా ఎర్రరేగడి నేలలు వీటికి అత్యంత అనుకూలం.
ఆకుకూరలు (కొత్తిమీర, పాలకూర): కొత్తిమీర, పాలకూర వంటి ఆకుకూరలు 20-25 రోజుల్లోనే ఆదాయాన్ని అందిస్తాయి. అధిక లాభాల కోసం చిన్న విస్తీర్ణంలో (10-20 గుంటలు) దశలవారీగా సాగు చేయడం మంచిది.
తీగజాతి కూరగాయల విషయంలో జాగ్రత్త
కాకర, బీర, కీర వంటి తీగజాతి కూరగాయల సాగుకు చలికాలం అనుకూలం కాదు. నవంబర్ 15 నుంచి జనవరి మొదటివారం వరకు ఉండే తీవ్రమైన చలి వాటి ఎదుగుదలను తగ్గిస్తుంది. పౌడరీ మిల్డ్యూ (బూడిద తెగులు) వంటి ఫంగస్ వ్యాధులు వచ్చే అవకాశం ఎకువగా ఉంటుంది. తెలంగాణలోని కరీంనగర్, నిజామాబాద్, వరంగల్, ఆదిలాబాద్ వంటి జిల్లాల్లో ఉష్ణోగ్రతలు 10-15 డిగ్రీల సెల్సియస్ కంటే తకువగా ఉంటాయి. ఈ ప్రాంతాల్లో తీగజాతి పంటలు సాగు చేయడం చాలా కష్టం. అయినప్పటికీ, 16-18 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత ఉన్న ప్రాంతాల్లో ప్రత్యేకమైన జాగ్రత్తలు, అధిక మోతాదులో ఎన్పీకే ఎరువులు, ప్లాంట్ గ్రోత్ ప్రమోటర్లు, బ్రాండెడ్ ఫంగీసైడ్లు తీసుకొని సాగు చేస్తే మంచి ధరలు పొందే అవకాశం ఉంటుంది. అయితే, దీనికి అనుభవం, సరైన యాజమాన్య పద్ధతులు తెలియడం అత్యవసరం.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Odisha teacher 14 days in ditch | కొండచరియలు విరుగడంతో గుంతలో చిక్కుకున్న టీచర్.. 14 రోజుల తర్వాత గుర్తించిన కాపరి
Watch: బైకులతో సింహాన్ని అడ్డుకున్న అటవీ శాఖ సిబ్బంది.. తర్వాత ఏం జరిగిందంటే?
Snowfall | ద్రాస్ సెక్టార్లో మంచు అందాల కనువిందు.. Video
Newborn dies due to DJ Sound | డీజే శబ్దానికి గుండె ఆగి.. నవజాత శిశువు మృతి
Watch: ప్రెస్మీట్లో ఒక వ్యక్తిని ముద్దుపెట్టుకున్న బీజేపీ ఎమ్మెల్యే.. ఏఐ వీడియో అని ఆయన భార్య ఆరోపణ

