Varun Sandesh First Look Poster | ‘హ్యపీ డేస్’, ‘కొత్తబంగారు లోకం’ వంటి వరుస విజయాలతో టాలీవుడ్లో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నాడు వరుణ్ సందేశ్. కానీ అదే జోష్‌ను తరువాత సినిమాల్లో కంటిన్యూ చేయలేకపోయాడు. వరుస ఫ్లాప్‌లు వెంటాడటంతో మధ్యలో క్యారెక్టర్ ఆర్టిస్టుగా పలు సినిమాల్లో నటించాడు. కానీ అవి కూడా వరుణ్ కెరీర్‌కు పెద్దగా ప్లస్ కాలేదు. దాంతో తిరిగి మరో సారి హీరోగా ‘ఇందువదన’ సినిమాతో రీ ఎంట్రీ ఇచ్చాడు. ఇక ఈ చిత్రం కూడా ఫ్లాప్‌గా మిగిలింది. అయితే వరుణ్ సందేశ్ ఈ సారి రూటు మార్చి.. విభిన్న కథతో ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధమయ్యాడు. తాజాగా ఈయన కొత్త సినిమాకు సంబంధించిన ఫస్ట్‌లుక్ పోస్టర్ రిలీజ్ అయ్యింది.
రమేష్ జక్కాల దర్శకత్వంలో వరుణ్ సందేశ్ ‘యద్భావం తద్భవతి’ అనే కాన్సెప్ట్ ఓరియెంటెడ్ సినిమా చేస్తున్నాడు. గురువారం వరుణ్ బర్త్‌డే సందర్భంగా మేకర్స్ ఫస్ట్‌లుక్ పోస్టర్‌ను విడుదల చేశారు. లేటెస్ట్గా విడుదలైన పోస్టర్లో వరుణ్ కళ్ళకు కూలింగ్ గ్లాసెస్ ధరించి నోట్లో సిగరెట్ కాల్చూతూ.. చేతి సంకెళ్ళను తెంచుకుని గన్‌తో ఫైరింగ్ చేస్తున్నాడు. ఈ పోస్టర్ సినిమాపై ఆసక్తిని పెంచుతుంది. ఇక ఈ సారి సరికొత్త క్యారెక్టర్‌తో వరుణ్ ప్రేక్షకులు ముందుకు రాబోతున్నట్లు తెలుస్తుంది. దీనితో పాటు సందీప్ కిషన్-విజయ్ సేతుపతి ప్రధాన పాత్రల్లో నటిస్తున్న మైఖేల్ సినిమాలో వరుణ్ సందేశ్ కీలకపాత్రలో నటిస్తున్నాడు.
#YadbhaavamTadbhavati 🔫 🔫 pic.twitter.com/qdXoppfU0i
— Varun Sandesh (@itsvarunsandesh) July 21, 2022