నిండు ప్రేమతో..వెండి నగలు!

నగలంటే అందరికీ మక్కువే. కొందరు ఇష్టంగా ధరిస్తారు. మరికొందరు ఇష్టమైనవారికి ప్రేమగా ఇస్తారు. అంతే తేడా! అయినా, అన్నిసార్లూ బంగారమే కొనాల్సిన పన్లేదు.బంగారంలాంటి మనసుతో వెండి నగలూ బహుమతిగా ఇవ్వొచ్చు. నిజానికి కొందరి శరీర ఛాయకు వెండి నగలే బావుంటాయి. కాబట్టే, రజత ఆభరణాలకు ఆదరణ పెరుగుతున్నది. వెండి నగల ప్రస్థానం ఈరోజు మొదలైందేం కాదు. వేల సంవత్సరాల క్రితమే దర్జాగా అలంకరించుకొన్న ఆధారాలున్నాయి. కొన్ని ఆదివాసీ తెగల ముస్తాబులో ఇప్పటికీ వెండి నగలదే హవా. బంగారం కొనగలిగే స్తోమత లేనివాళ్లు సహజంగానే వెండివైపు మొగ్గు చూపుతున్నారు. వజ్రాలు కొనగలిగేఆర్థిక శక్తి ఉన్నా, మక్కువతో వెండి నగలు అలంకరించుకొనే అతివలూ అనేకమంది.
వెండి నగలంటే అచ్చంగా వెండితో చేసినవే కానక్కర్లేదు. రకరకాల మూలకాలను కలిపి రూపొందించినవీ అనేకం. స్టెర్లిన్, ఆక్సిడైజ్డ్, జర్మన్ సిల్వర్ నగలు బంగారంతో పోలిస్తే చాలా తక్కువ ధరలో లభిస్తాయి. రాళ్లు, వజ్రాల మేళవింపుతో ఆధునికంగానూ కనిపిస్తాయి. బంగారు నగల తయారీలో పెళుసుదనం కోసం రాగిని కలిపినట్లే, వెండి నగల రూపకల్పనలో ఇతర మూలకాలను జోడిస్తారు. 92.5 శాతం స్వచ్ఛమైన వెండితో తయారయ్యే నగలను
‘స్టెర్లిన్ సిల్వర్ జువెలరీ’ అంటారు. దీనిలో మిగతా 7.5 శాతం రాగి, నికెల్, రోడియం వంటి మూలకాలను కలుపుతారు. దీనివల్ల వెండికి గట్టిదనంతోపాటు మెరుపూ తోడవుతుంది.
రెండు రకాలు..
వెండి నగలు రెండు రకాలు. 92.5 శాతం వెండితో తయారయ్యే వాటిని ‘కోటెడ్ సిల్వర్ జువెలరీ’ అంటారు. వీటికి మన్నిక ఎక్కువ. ఎన్నిరోజులు వాడినా, ఎలా వాడినా మెరుపు తగ్గవు. తెగిపోయినా, పాడయిపోయినా కరిగించి మళ్లీ కొత్త నగలు చేయించుకోవచ్చు. వేరే మూలకంతో తయారుచేసి, పైన మాత్రం స్వచ్ఛమైన వెండి పూత పూసే నగలను ‘ప్లేటెడ్ సిల్వర్ జువెలరీ’ అంటారు. వీటికి మన్నిక తక్కువ. వేడినీరు తగలకుండా, గీతలు పడకుండా జాగ్రత్తగా వాడుకోవాలి. తొలినాళ్లలో మెరుపులు మెరిపించినా, కొన్నాళ్లకు నల్లబడే అవకాశం ఎక్కువ. వీటి ధర తక్కువ. రకరకాల దుస్తుల మీదికి
‘మ్యాచింగ్ కాంబో’లను ఎంచుకోవచ్చు.
నవరత్నాలతో
వెండి నగలకు వజ్రాలు, కెంపులు, పచ్చలు.. వంటి జాతి రాళ్లను జతచేయడంతో ఆధునిక దుస్తులపైనా మెరిసిపోతూ కనిపిస్తాయి. రోజువారీ వాడకానికి సౌకర్యవంతం కూడా. ఆభరణాల్లో ప్రేమ కానుకలది ప్రత్యేక స్థానం. ఉంగరాలు, వాచీలు, బ్రేస్లెట్లు, చైన్లు.. నగ ఏదైనా ఇద్దరి మధ్యా ప్రేమ
వారధిగా మారిపోతుంది. అందుకే, వెండితో రకరకాల ప్రేమ కానుకలు చేస్తున్నారు. ప్రేమికులిద్దరూ ధరించేలా ఒకేరకంగా డిజైన్ చేసిన ఉంగరాలు, బ్రేస్లెట్లు మరీ ప్రత్యేకం. అక్షరాలు, పదాలు, గుర్తులు.. ఒకటేమిటి కోరుకున్న విధంగా మనసులోని వ్యక్తికి, మనసుకునచ్చే నగలను బహూకరించవచ్చు.
Read Today's Latest News News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
BRS Denmark | తప్పుడు కథనాన్ని ప్రచురించిన వెలుగు పత్రిక యాజమాన్యం క్షమాపణ చెప్పాలి : బీఆర్ఎస్ డెన్మార్క్
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
priest predicted son, shot dead | కొడుకు పుడతాడని జోస్యం చెప్పిన పూజారి.. కుమార్తె జన్మించడంతో ఆయనపై కాల్పులు జరిపి హత్య
Fauzi | దర్శకుడికి గాయం.. ప్రభాస్ ‘ఫౌజీ’ షూటింగ్కు చిన్న బ్రేక్
Tragedy | పండుగ పూట విషాదం.. రోడ్డు ప్రమాదంలో అన్న, చెల్లి దుర్మరణం
ట్రెండింగ్ వార్తలు
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!

