పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, గ్లామర్ బ్యూటీ శృతి హాసన్ ప్రధాన పాత్రలలో వేణు శ్రీరామ్ తెరకెక్కించిన చిత్రం వకీల్ సాబ్. ఏప్రిల్ 9న విడుదల కానున్న ఈ సినిమా ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు జరుపుకుంటుంది. తాజాగా పవన్ కళ్యాణ్ తన డబ్బింగ్ పార్ట్ పూర్తి చేశాడు. ఈ విషయాన్ని మేకర్స్ అఫీషియల్‌గా ప్రకటించారు. థియేట్రికల్ ట్రైలర్‌ను ఈ నెల 29న రిలీజ్ చేయనుండగా, ఇది ఫ్యాన్స్ ఆనందానికి అవధులు లేకుండా చేస్తుందని అంటున్నారు.
ఏప్రిల్ 9న ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ కాబోతున్న ‘‘వకీల్ సాబ్’’ పై ఇప్పటికే భారీ అంచనాలున్నాయి. ట్రైలర్ కూడా అంచనాలను మరింత పెంచేదిలా ఉంటుందని నమ్ముతున్నారు మేకర్స్. ఇప్పటికే మొదలైన ప్రమోషన్స్ సినిమా బజ్ ను పెంచేశాయి. నివేదా థామస్, అంజలి, అనన్య నాగళ్ల ఇతర తారాగణంగా నటిస్తున్నారు. ఈ చిత్రానికి సంగీతం: ఎస్.ఎస్.తమన్, సినిమాటోగ్రఫీ: పి.ఎస్.వినోద్ అందిస్తున్నారు. దిల్ రాజు, బోని కపూర్ సంయుక్తంగా నిర్మించిన ఈ చిత్రం హిందీలో సూపర్ హిట్ కొట్టిన పింక్ రీమేక్‌గా రూపొందింది.