శ్రీహర్ష, ప్రియా శ్రీనివాస్, మణిచందన ప్రధాన పాత్రల్లో నటిస్తున్న చిత్రం ‘వధుకట్నం’. భార్గవ గొట్టిముక్కల దర్శకుడు. షేక్బాబుసాహెబ్(బాబుషా) నిర్మాత. ట్రైలర్‌ను ఇటీవల విడుదలచేశారు. నిర్మాత మాట్లాడుతూ ‘మహిళల పట్ల సమాజంలో కొనసాగుతున్న వివక్షను చర్చిస్తూ తెరకెక్కిస్తున్న చిత్రమిది. ఆడపిల్లల శాతం తగ్గిపోతే తలెత్తే పరిణామాలేమిటో సందేశాత్మకంగా ఈ సినిమాలో చూపించబోతున్నాం. వధువుకు ఎదురుకట్నం ఇచ్చి పెళ్లిళ్లు చేసుకోవాల్సిన పరిస్థితి భవిష్యత్తులో వస్తుందనే పాయింట్‌ను చర్చిస్తున్నాం. ఆలోచనాత్మక చిత్రంగా సెన్సార్ సభ్యుల ప్రశంసలు అందుకోవడం ఆనందంగా ఉంది. ఈ నెల 31న సినిమాను విడుదలచేయనున్నాం’ అని తెలిపారు. రఘు.జి, కవిత శ్రీరంగం, ఆర్యన్గౌర ప్రధాన పాత్రల్లో నటిస్తున్న ఈ చిత్రానికి సినిమాటోగ్రఫీ: ఎస్.డి.జాన్.