హబూబ్‌నగర్, మార్చి 16 : జిల్లాను కనీవినీ ఎ రుగని రీతిలో అభివృద్ధి చేస్తున్నామని ఎక్సైజ్, క్రీడా శాఖ మంత్రి శ్రీనివాస్‌గౌడ్ తెలిపారు. బుధవారం మంత్రి జ న్మదినం సందర్భంగా జిల్లా కేంద్రంలో భారీగా ఏర్పాట్లు చేశారు. ముందుగా మంత్రి శ్రీనివాస్‌గౌడ్ తన స్వగృహంలో కుటుంబసభ్యుల సమక్షంలో అర్చకులతో ఆశీర్వచనం తీసుకున్నారు. మంత్రికి కలెక్టర్ వెంకట్రావు, ఎస్పీ వెంకటేశ్వర్లు పుష్పగుచ్ఛాలు అందజేసి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. క్రౌన్ గార్డెన్లో మంత్రి 53వ జన్మదినం సందర్భంగా 53 కేజీల కేక్‌ను కట్ చేశారు. మంత్రి శ్రీనివాస్‌గౌడ్ తన సతీమణి శారద, కుటుంబ సభ్యులకు కేక్ తినిపించారు. నలుగురు దివ్యాంగులకు స్కూటీలు, ఆరు ట్రైసైకిళ్లు, రూ.24లక్షల విలువ చేసే రెం డు ట్రాక్టర్లు, వ్యవసాయ పనిముట్లను పంపిణీ చేశారు. అనంతరం టీఎన్జీవోఎస్ భవనం ఎదుట ఏర్పాటు చే సిన వేడుకలకు హాజరయ్యారు. ఉద్యోగులపై సీఎం కేసీఆర్ సానుకూలంగా ఉన్నారని, ఉద్యోగ సంఘాల సమావేశాలకు వస్తే.. మా ఇంటికి వచ్చిన అనుభూతి కలుగుతుందని మంత్రి పేర్కొన్నారు. ఉద్యోగుల జాయింట్ యాక్షన్ కమిటీ నేతలు మంత్రిని గజమాలతో సత్కరించారు. అలాగే మార్చి 2021 నుంచి ఫిబ్రవరి 2022 వ రకు వివిధ అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలకు మంత్రి హాజరైన పత్రిక క్లిప్పింగ్‌లతో సమాచార శాఖ ఆధ్వర్యం లో రూపొందించిన పుస్తకాలను మంత్రి ఆవిష్కరించా రు. ఆర్అండ్బీ అతిథి గృహం వద్ద కౌన్సిలర్ కిశోర్‌కుమార్ ఆధ్వర్యంలో కేక్ కట్ చేశారు. మెట్టుగడ్డ వద్ద ఏ ర్పాటు చేసిన కార్యక్రమంలో కేక్ కట్ చేశారు. అంధుల పాఠశాలలో విద్యార్థుల సమక్షంలో మంత్రి కేక్ కట్ చేశారు. విద్యార్థులకు దుస్తులు, స్వీట్లు, పండ్లు పంపిణీ చేశారు. టీఎంవీస్జీ ఆధ్వర్యంలో క్లాక్‌టవర్ వద్ద మంత్రి శ్రీనివాస్‌గౌడ్‌ను 22 ఫీట్ల గజమాలతో సత్కరించారు. ఆయా కార్యక్రమాల్లో అదనపు కలెక్టర్లు తేజస్‌నందలాల్‌పవార్, సీతారామారావు, మున్సిపల్ చైర్మన్ నర్సింహులు, గ్రంథాలయ సంస్థ జిల్లా చైర్మన్ రాజేశ్వర్‌గౌడ్, వైస్ చైర్మన్ గణేశ్, అంధుల పాఠశాల ప్రిన్సిపాల్ రాము లు, డాక్టర్ శ్వేత, గజిటెడ్ అధికారుల సంఘం జిల్లా అ ధ్యక్షుడు రాజగోపాల్, టీఎన్జీవో జిల్లా అధ్యక్షుడు రాజీవ్‌రెడ్డి, సభ్యులు రాజగోపాల్, ప్రతాప్, రాజేందర్‌రెడ్డి, శ్రీనివాసులు, సమాచార శాఖ అసిస్టెంట్ డైరెక్టర్ వెంకటేశ్వర్లు, నాయకులు వెంకటేశ్, సుదీప్‌రెడ్డి, నారాయణగౌడ్, వెంకటేశ్వర్‌గౌడ్, బాలకృష్ణగౌడ్, శివరాజ్ ఉన్నారు.