పుణెలో ‘వ్యాక్సిన్ ఆన్ వీల్స్’
పుణె మున్సిపల్ కార్పొరేషన్ అధికారులు కాస్తా విభిన్నంగా ఆలోచించి అందరికీ వ్యాక్సిన్లు అందించేందుకు ‘వ్యాక్సిన్ ఆన్ వీల్స్’ కార్యక్రమాన్ని చేపట్టాలని నిర్ణయించారు.

మహారాష్ట్రలో కరోనా వైరస్ కేసులు తగ్గుముఖం పట్టినప్పటికీ వ్యాక్సినేషన్ ప్రక్రియ మందకోడిగా సాగుతున్నది. రాష్ట్రంలోని పలు జిల్లాల్లో వ్యాక్సిన్ స్టాక్ లేకపోవడంతో టీకాలు ఇచ్చే పనులను నిలిపివేశారు. రెండు రోజులుగా బోసిపోయిన కరోనా వ్యాక్సినేషన్ కేంద్రాలకు మళ్లీ టీకాలు రావడం మొదలవడంతో వీలైనంత ఎక్కువ మందికి టీకాలు ఇవ్వాలని అధికారులు ప్లాన్ చేశారు. పుణెలో పుణె మున్సిపల్ కార్పొరేషన్ అధికారులు కాస్తా విభిన్నంగా ఆలోచించి అందరికీ వ్యాక్సిన్లు అందించేందుకు ‘వ్యాక్సిన్ ఆన్ వీల్స్’ కార్యక్రమాన్ని చేపట్టాలని నిర్ణయించారు.
కేంద్ర ప్రభుత్వం సూచనల మేరకు 18 పైబడిన వారికి టీకాలు ఇచ్చేందుకు పుణె మున్సిపల్ కార్పొరేషన్ అధికారులు చర్యలు చేపట్టారు. ఇండియాలోనే తొలిసారిగా ‘వ్యాక్సిన్ ఆన్ వీల్స్’ చేపడుతున్నారు. ఈ నెల తొలివారంలో ఈ కార్యక్రమాన్ని విజయవంతంగా చేపట్టాలని ప్రణాళికలు సిద్ధం చేశారు. ఒక్కో వ్యానులో డాక్టరు, నర్సింగ్ సిబ్బందితో ‘వ్యాక్సిన్ ఆన్ వీల్స్’ నిర్వహించనున్నారు. పుణె వ్యాప్తంగా ఈ మాదిరి 15 యూనిట్లను ఏర్పాటు చేసి నిత్యం 150 డోసులు ఇచ్చేలా చూడనున్నారు. వివిధ కారణాలతో వ్యాక్సిన్ కేంద్రాలకు రాలేని వృద్ధులు, రోగగ్రస్థులు, ఇతర సమస్యలతో బాధపడుతున్న వారి వద్దకే వైద్యబృందం వెళ్లి టీకాలు ఇవ్వడం ఈ కార్యక్రమం ప్రధాన ఉద్దేశం.
ప్రస్తుతం సెకండ్ వేవ్ దశలో ఉన్నామని, ఇప్పటికే ఎంతో నష్టాన్ని చవిచూశామని, ఇక థర్డ్ వేవ్ వస్తే మరింత నష్టాన్ని చూడాల్సి వచ్చే అవకాశాలు ఉన్నందున వ్యాక్సిన్ ఆన్ వీల్స్ చేపడుతున్నట్లు పుణె మున్సిపల్ కార్పొరేషన్ అదనపు కమిషనర్ రుబాల్ అగర్వాల్ చెప్పారు. కరోనా వైరస్ను నిర్మూలించడానికి వ్యాక్సిన్ తీసుకోవడం ఒక్కటే సరైన మార్గమని, అందుకే అందరికీ వ్యాక్సిన్ను అందుబాటులోకి తెచ్చేందుకు ‘వ్యాక్సిన్ ఆన్ వీల్స్’ చేపడుతున్నామన్నారు.
ఇవి కూడా చదవండి..
రాజకీయాల్లో సరికొత్త ట్రెండ్ పీకే
కేరళలో చరిత్ర తిరిగరాసిన ఎల్డీఎఫ్.. 40 ఏళ్ల రికార్డు బద్దలు
అమ్మను బతికించుకోవాలని.. నోటితో ఆక్సిజన్ అందించిన కూతుర్లు
రాజస్థాన్ ఉప ఎన్నిక : రెండింటిలో కాంగ్రెస్, ఒక స్థానంలో బీజేపీ గెలుపు
జార్ఖండ్ ఉప ఎన్నిక : మధుపూర్లో జేఎంఎం ఆధిక్యం
ఉత్తరాఖండ్ ఉప ఎన్నిక : బీజేపీ ముందంజ
ఎంపీ ఉప ఎన్నిక : దమోహాలో కాంగ్రెస్ ముందంజ
యూపీలో వారాంతపు లాక్డౌన్ సమయం పొడగింపు
అసోంలో అధికారాన్ని నిలబెట్టుకునే దిశగా ఎన్డీఏ
తాజా వార్తల కోసం నమస్తే తెలంగాణ ఫేస్బుక్ , ట్విటర్, టెలిగ్రామ్ ను ఫాలో అవండి..
Read Today's Latest News News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
మంత్రిగారి సిఫార్సు.. మహా కుంభకోణం వివేక గంగాధరం!
రైతన్నపై ఆంక్షలు.. కాలువల్లో మోటర్లు వాడొద్దు.. నీళ్లు తోడొద్దు
పోటీకి జంకేది లేదు.. ఎవరికైనా చట్టాలు ఒక్కటే.. మస్క్కు గట్టిగా కౌంటర్ ఇచ్చిన రిలయన్స్
రేవంత్ సర్కార్లో అన్నీ స్కామ్లే.. కార్మికుల సొమ్మునూ వదలట్లే
కమీషన్ల కోసమే కొడంగల్-పేట ఎత్తిపోతలు!
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్పై ప్రభావం ఉంటుందా..?

