e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Thursday, May 6, 2021
Home Election News రాజకీయాల్లో సరికొత్త ట్రెండ్.. ప్రశాంత్‌ కిషోర్‌

రాజకీయాల్లో సరికొత్త ట్రెండ్.. ప్రశాంత్‌ కిషోర్‌

రాజకీయాల్లో సరికొత్త ట్రెండ్.. ప్రశాంత్‌ కిషోర్‌

ప్రశాంత్ కిషోర్.. ప్రస్తుతం దేశ వ్యాప్తంగా రాజకీయాల్లో సంచలనం సృష్టిస్తున్న పేరు. ఆయన ఏ రాష్ట్రంలో కాలిడితే అక్కడ తన వ్యూహంతో తన సాయం కోరిన రాజకీయ పార్టీకి తిరుగులేని విజయాన్ని అందిస్తూ వస్తున్నారు. ఇప్పటికే పలు రాష్ట్రాల్లో తనను వెతుక్కుంటూ వచ్చిన రాజకీయ పార్టీలకు అఖండ విజయం సాధించేలా స్ట్రాటజీలను తయారుచేసిన ప్రశాంత్ కిషోర్‌ ( Prashanth kishor ).. తాజాగా రెండు రాష్ట్రాలు.. పశ్చిమాన పశ్చిమ బెంగాల్‌, దక్షిణాన తమిళనాడులో విజయం అందించిపెట్టారు. ఇంతకీ ఎవరీ ప్రశాంత్‌ కిషోర్‌..? ఈయనకు భారత రాజకీయాలకు ఏమిటీ సంబంధం..? అయన ఎందుకు ఇలా స్ట్రాటజిస్ట్‌గా మారారు..? తదుపరి ఆయన ఏం చేయబోతున్నారు..? ఇలాంటి ప్రశ్నలెన్నో సామాన్యుడి మదిని తొలుస్తున్నాయి.

ప్రశాంత్ కిషోర్‌ బిహార్‌లోని రోహ్తాస్‌ జిల్లాలోని కోనార్‌ గ్రామంలో మధ్యతరగతి కుటుంబంలో 1977 లో జన్మించారు. ఆయన తండ్రి శ్రీకాంత్‌ పాండే వృత్తిరీత్యా వైద్యుడు. తన వృత్తిని చేపట్టేందుకు ఆయన కుటుంబంతో సహా బక్సార్‌కు మారారు. అక్కడే కిషోర్‌ ప్రాథమిక విద్యా పూర్తిచేశారు. హైదరాబాద్‌లో ఇంజినీరింగ్‌ చదివిన కిషోర్‌ రాజకీయాలపై ఆసక్తితో 2018 సెప్టెంబర్‌ నెలలో జనతాదళ్‌ (యు) పార్టీలో చేరారు. సిటిజన్‌షిప్‌ అమెండమెంట్ యాక్ట్ (సీఏఏ)కు బిహార్‌ ముఖ్యమంత్రి నితీష్‌ కుమార్‌ మద్దతు తెలుపడాన్ని వ్యతిరేకించడంతో 2020 జనవరి నెలలో ఆయనను పార్టీ నుంచి బహిష్కరించారు.

జనతాదళ్‌ పార్టీలో చేరడానికి ముందు ఆయన పబ్లిక్‌ హెల్త్‌ రంగంలో పనిచేశారు. అలాగే, ఐక్యరాజ్య సమితిలో ఎనిమిదేండ్లపాటు వివిధ హోదాల్లో సేవలందించారు. ఈయన భార్య జాహ్నవిదాస్‌ వైద్యురాలిగా ఉన్నారు. కిషోర్‌ దంపతులకు ఒక కుమారుడు ఉన్నాడు.

మోదీని గెలిపించాడు..

రాజకీయాల్లో సరికొత్త ట్రెండ్.. ప్రశాంత్‌ కిషోర్‌

గుజరాత్ ఎన్నికల సమయంలో 2012 లో నరేంద్ర మోదీ మూడోసారి ముఖ్యమంత్రిగా ఎన్నికయ్యేందుకు బీజేపీకి సహాయం చేయడానికి కిషోర్‌ తన తొలి రాజకీయ ప్రచారం చేపట్టారు. అయితే, 2014 లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీ విజయంతో ప్రశాంత్ కిశోర్ పేరు దేశవ్యాప్తంగా వార్తల్లో నిలిచింది. కిషోర్‌ అటు బీజేపీకి, ఇటు కాంగ్రెస్‌కు కూడా వ్యూహకర్తగా పనిచేశారు.

2013 లో సిటిజెన్స్‌ ఫర్‌ అకౌంటబుల్‌ గవర్నెన్స్‌ (సీఏజీ) ని స్థాపించారు. దీని ద్వారానే 2014 సార్వత్రిక ఎన్నికల్లో మీడియా ప్రచారం నిర్వహించారు. చాయ్‌ పే చర్చా, 3డీ ర్యాలీలు, రన్‌ ఫర్‌ యూనిటీ, మంథన్‌ బైటక్‌ వంటి అనేక కార్యక్రమాలను చేపట్టి నరేంద్ర మోదీ ఇమేజీ గ్రాఫ్‌ను పెంచారు. మోదీతో విడిపోయిన తర్వాత సీఏజీని కాస్తా ఇండియన్‌ పొలిటికల్‌ యాక్షన్‌ కమిటీగా మార్చాడు.

2015 బిహార్‌ ఎన్నికలు, 2016 పంజాబ్‌ ఎన్నికలు, 2017 యూపీ ఎన్నికలు, 2019 ఏపీ ఎన్నికలు, 2020 ఢిల్లీ ఎన్నికలు, 2020 బిహార్‌ ఎన్నికలు, 2021 పశ్చిమ బెంగాల్‌, తమిళనాడు ఎన్నికల్లో తన వ్యూహాలను పదునుపెట్టి తన వారికి విజయం దక్కేలా చేయగలిగారు. 2022 లో మరోసారి పంజాబ్‌ ఎన్నికల్లో కాంగ్రెస్‌ పార్టీకి వ్యూహకర్తగా వ్యవహరించేందుకు ఇదివరకే ఒప్పందం చేసుకున్నారు.

ఇవి కూడా చదవండి..

కేరళలో చరిత్ర తిరిగరాసిన ఎల్డీఎఫ్‌.. 40 ఏళ్ల రికార్డు బద్దలు

అమ్మను బతికించుకోవాలని.. నోటితో ఆక్సిజన్‌ అందించిన కూతుర్లు

రాజస్థాన్‌ ఉప ఎన్నిక : రెండింటిలో కాంగ్రెస్‌, ఒక స్థానంలో బీజేపీ గెలుపు

జార్ఖండ్‌ ఉప ఎన్నిక : మధుపూర్‌లో జేఎంఎం ఆధిక్యం

ఉత్తరాఖండ్‌ ఉప ఎన్నిక : బీజేపీ ముందంజ

ఎంపీ ఉప ఎన్నిక : దమోహాలో కాంగ్రెస్‌ ముందంజ

యూపీలో వారాంతపు లాక్‌డౌన్‌ సమయం పొడగింపు

అసోంలో అధికారాన్ని నిలబెట్టుకునే దిశగా ఎన్డీఏ

తాజా వార్తల కోసం నమస్తే తెలంగాణ ఫేస్‌బుక్‌ , ట్విటర్‌టెలిగ్రామ్‌ ను ఫాలో అవండి..

Advertisement
రాజకీయాల్లో సరికొత్త ట్రెండ్.. ప్రశాంత్‌ కిషోర్‌
-Advertisement-

తాజావార్తలు

Advertisement

ట్రెండింగ్‌

Advertisement