హైదరాబాద్, ఆట ప్రతినిధి: జపాన్‌లో జరుగుతున్న 20వ ఆసియా క్రీడల్లో ఒలింపిక్ కౌన్సిల్ ఆఫ్ ఆసియా (ఓసీఏ) అబ్జర్వర్‌గా తెలంగాణ స్పోర్ట్స్ కమిటీ సభ్యుడు, అర్జున అవార్డు గ్రహీత వి. రవికాంత్ రెడ్డి నియమితులయ్యారు. భారత క్రీడారంగానికి ఆయన అందించిన సేవలకు గుర్తింపుగా ఓసీఏ ఈ కీలక బాధ్యతలు అప్పగించింది.