హైదరాబాద్, ఆట ప్రతినిధి: తెలంగాణ షో జంపింగ్ చాంపియన్షిప్లో 11 ఏండ్ల బాలుడు మీర్ నజముద్దీన్ అజామ్ అసాధారణ ప్రదర్శనతో రాణించి చాంపియన్ రైడర్ టైటిల్ కైవసం చేసుకున్నాడు. హైదరాబాద్లోని నాసర్ పోలో అండ్ ఈక్వెస్ట్రియన్ అకాడమీ వేదికగా జరిగిన పోటీల్లో సుమారు 450 మందికి పైగా రైడర్లు పాల్గొనగా వయస్సుకు మించిన ఆత్మవిశ్వాసం, పట్టుదలతో రికోటా, సనా అశ్వాలపై స్వారీ చేస్తూ 105-110 సెం.మీ, అండర్-14, 60 సెం.మీ. తో పాటు ఓపెన్ కేటగిరీల్లో ప్రథమ స్థానాలను సాధించాడు. మూడు వేర్వేరు ఈవెంట్లలో పసిడి పతకాలు సాధించి అగ్రస్థానంలో నిలవడం ద్వారా చాంపియన్షిప్ టైటిల్ను సొంతం చేసుకున్నాడు.