లండన్: ఇంగ్లండ్ పేసర్ మార్క్ వుడ్ అంతర్జాతీయ క్రికెట్కు వీడ్కోలు పలికాడు. ఇంగ్లండ్ గెలిచిన రెండు ప్రపంచకప్ (2019 వన్డే, 2022 టీ20) లలో సభ్యుడిగా ఉన్న అతడు.. 11 ఏండ్ల కెరీర్లో 38 టెస్టులు, 70 వన్డేలు, 38 టీ20ల్లో ఇంగ్లిష్ జట్టుకు ప్రాతినిథ్యం వహించాడు. 2015లో అరంగేట్రం చేసిన ఈ బౌలర్.. టెస్టుల్లో 119, వన్డేల్లో 80, టీ20ల్లో 54 వికెట్లు పడగొట్టాడు.