దేవరకొండ రూరల్, మే 14 : నల్లగొండ జిల్లా దేవరకొండలోని ఏరియా హాస్పిటల్లో ఐసీడీఎస్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఊయల సెంటర్ను ఏఎస్పీ మౌనిక బుధవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. వివిధ కారణాలతో తల్లిదండ్రులు తమకు వద్దనుకున్న పిల్లల సంరక్షణ కోసం ఈ సెంటర్ను ఏర్పాటు చేసినట్టు తెలిపారు. పిల్లలను సాకలేక, భారంగా భావించిన తల్లిదండ్రులు ఈ ఊయల సెంటర్ను ఉపయోగించుకోవాల్సిందిగా కోరారు. ఈ కార్యక్రమంలో ఏరియా హాస్పిటల్ సూపరింటెండెంట్ రవి ప్రకాశ్, సీడీపీఓ చంద్రకళ, చైల్డ్ వెల్ఫేర్ కమిటీ చైర్ పర్సన్ చింత కృష్ణ, సూపర్వైజర్లు రాధా, చిట్టమ్మ, విజయలక్ష్మి పాల్గొన్నారు.
Devarakonda Rural : దేవరకొండ ఏరియా హాస్పిటల్లో ఊయల సెంటర్ ప్రారంభం