Ustaad Bhagat Singh | ఉస్తాద్ భగత్ సింగ్ నుంచి క్రేజీ అప్డేట్ ఇచ్చిన మేకర్స్
Ustaad Bhagat Singh | వరుస చిత్రాలతో బిజీగా గడుపుతున్నారు స్టార్ హీరో పవన్ కళ్యాణ్ (Pawan Kalyan). ఆయన చేస్తున్న సినిమాల్లో ఆసక్తి కలిగిస్తున్న చిత్రం ‘ఉస్తాద్ భగత్ సింగ్’. తాజాగా ఈ సినిమా నుంచి నిర్మాణ సంస్థ (Mythri Movie Makers) క్రేజీ అప్డేట్ ఇచ్చారు.
Ustaad Bhagat Singh | వరుస చిత్రాలతో బిజీగా గడుపుతున్నారు స్టార్ హీరో పవన్ కళ్యాణ్ (Pawan Kalyan). ఆయన చేస్తున్న సినిమాల్లో ఆసక్తి కలిగిస్తున్న చిత్రం ‘ఉస్తాద్ భగత్ సింగ్’. ఈ సినిమాను మైత్రీ మూవీ మేకర్స్ (Mythri Movie Makers) సంస్థ నిర్మిస్తున్నది. హరీష్ శంకర్ (Harish Shanker) దర్శకత్వం వహిస్తున్న.. ఈ సినిమా ప్రస్తుతం సెట్ వర్క్ పూర్తి చేసుకుంటుంది. ఇప్పటికే విడుదలైన ఫస్ట్ గ్లింప్స్ సినిమా ఏ రేంజ్లో ఉండబోతుందో హింట్ ఇచ్చేసింది. నెట్టింట ట్రెండింగ్ అవుతూ మిలియన్ల సంఖ్యలో వ్యూస్ రాబడుతోంది గ్లింప్స్.

Pawan Kalyan
అయితే ‘ఉస్తాద్ భగత్ సింగ్’ నుంచి మేకర్స్ క్రేజీ అప్డేట్ ఇచ్చారు.. ఈ సినిమా షూటింగ్లో భాగంగా త్వరలో భారీ షెడ్యూల్ ప్రారంభించబోతున్నామని.. మరోసారి చరిత్రను తిరగరాద్దామంటూ మేకర్స్ వెల్లడించారు. దానితో పాటు “ఏ ఫ్యూ థింగ్స్ అండ్ ఏ ఫ్యూ బాండ్స్ విల్ నేవర్ చేంజ్” అని గబ్బర్ సింగ్, ‘ఉస్తాద్ భగత్ సింగ్’ షూటింగ్ ఫోటోలను నిర్మాణ సంస్థ ట్విట్టర్లో విడుదల చేసింది. గబ్బర్ సింగ్ లాంటి బ్లాక్ బస్టర్ కాంబినేషన్లో వస్తున్న సినిమా కావడంతో అంచనాలు భారీగానే ఉన్నాయి. ఈ చిత్రంలో శ్రీలీల ఫీ మేల్ లీడ్ రోల్లో నటిస్తోంది. దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నాడు.

Sreeleela
ఈ చిత్రంతో పాటు పవన్ కళ్యాణ్ క్రిష్ దర్శకత్వంలో ‘హరి హర వీరమల్లు’(Harihara Veeramallu), సుజీత్ దర్శకత్వంలో ‘ఓజీ’ (ఒరిజినల్ గ్యాంగ్స్టర్), సాయి ధరమ్తేజ్తో కలిసి ‘బ్రో‘ (వినోదయ సితమ్ రీమేక్) లో నటిస్తున్నారు.
Team #UstaadBhagatSingh is gearing up for the next Massive schedule with Blockbuster energy 💥💥
Let’s rewrite history once again ❤️🔥@PawanKalyan @harish2you @sreeleela14 @ThisIsDSP @DoP_Bose #AnandSai @ChotaKPrasad @SonyMusicSouth @UBSTheFilm pic.twitter.com/Ci8fz2JN2H
— Mythri Movie Makers (@MythriOfficial) July 2, 2023
Read Today's Latest News News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్పై ప్రభావం ఉంటుందా..?

