Lok Sabha Polls | ప్రజల నుంచి మంచి స్పందన వచ్చింది.. రేపు పోలింగ్ శాతం వెల్లడిస్తాం : సీఈవో వికాస్ రాజ్
Lok Sabha Polls | తెలంగాణలో సార్వత్రిక ఎన్నికల పోలింగ్ ముగిసింది. సాయంత్రం 5 గంటల వరకు రాష్ట్రంలో వరకు 61.59శాతం నమోదైందని ఎన్నికల సంఘం తెలిపింది. ఓటింగ్ పూర్తయిన చోట ఈవీఎంలను సిబ్బంది సీజ్ చేసి.. ఈవీఎంలను స్ట్రాంగ్ రూమ్‌లకు తరలిస్తున్నారు.
Lok Sabha Polls | తెలంగాణలో సార్వత్రిక ఎన్నికల పోలింగ్ ముగిసింది. సాయంత్రం 5 గంటల వరకు రాష్ట్రంలో వరకు 61.59శాతం నమోదైందని ఎన్నికల సంఘం తెలిపింది. ఓటింగ్ పూర్తయిన చోట ఈవీఎంలను సిబ్బంది సీజ్ చేసి.. ఈవీఎంలను స్ట్రాంగ్ రూమ్‌లకు తరలిస్తున్నారు. ఈ సందర్భంగా ఎన్నికల ప్రధాన అధికారి వికాస్ రాజ్ మాట్లాడుతూ ఎన్నికల్లో ప్రజల నుంచి మంచి స్పందన వచ్చిందన్నారు. రాష్ట్రంలో పోలింగ్ శాతం బాగానే నమోదైందని.. ఓటింగ్ శాతం ఎక్కువగా నమోదైందన్నారు. తుది ఓటింగ్ శాతం ఎంత అనేది మంగళవారం వెల్లడిస్తానన్నారు.
106 అసెంబ్లీ సెగ్మెంట్లలో సాయంత్రం 6 గంటల తర్వాత కూడా పోలింగ్ జరిగిందన్నారు. 1400 పోలింగ్ కేంద్రాల దగ్గర క్యూలో ఓటర్లు ఉ న్నారన్నారు. సోమవారం 400 ఫిర్యాదులు వచ్చాయని.. 200పైగా సీ విజిల్ ద్వారా ఫిర్యాదులు స్వీకరించామన్నారు. 38 ఎఫ్ఐఆర్లు నమోదయ్యాదయన్నారు. ఈవీఎంలను భద్రపరించేందుకు రాష్ట్రంలో 44 స్ట్రాంగ్ రూమ్‌లు ఏర్పాటు చేసినట్లు పేర్కొన్నారు. జీపీఎస్ ఉన్న వాహనాల్లోనే ఈవీఎంలు తరలిస్తామన్నారు. ఈవీఎంల తరలింపు అర్ధరాత్రి వరకు జరిగే అవకాశం ఉందన్నారు. ఎన్నికలు సజావుగా సాగేలా సహకరించిన అందరికీ ధన్యవాదాలు తెలిపారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Medak | కేసీఆర్ మరోసారి సీఎంగా బాధ్యతలు చేపడితేనే తెలంగాణకు మోక్షం
Motorola | మోటరోలా నుంచి మరో ఫోల్డబుల్ ఫోన్.. పేరు, ఫీచర్లు లీక్.. ఎప్పుడొస్తుందంటే?
Suspicious Death | అమెరికాలో జగిత్యాల జిల్లా యువకుడు అనుమానాస్పద స్థితిలో మృతి
AP SEO | పట్టణ ప్రాంతాల్లో ఎన్నికల కోడ్ ఎత్తివేత : ఏపీ ఎస్ఈవో
Triptii Dimri | బ్లాక్ అవుట్‌ఫిట్‌లో బ్యూటీ క్వీన్ త్రిప్తి దిమ్రి అందాల విందు
ట్రెండింగ్ వార్తలు
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి

