US Senators on Debt Raise | 28.9 ట్రిలియన్ డాలర్లకు యూఎస్ రుణం?!
US Senators on Debt Raise | అమెరికా రుణాలను 28.4 ట్రిలియన్ల నుంచి 28.9 ట్రిలియన్ డాలర్లకు పెంచేందుకు సెనెటర్ల మధ్య అంగీకారం కుదిరింది.

US Senators on Debt Raise | వచ్చే డిసెంబర్ వరకు రుణాల పరిమితిని మరో 480 బిలియన్ల డాలర్లకు పెంచుకునేందుకు ట్రేజరీ డిపార్ట్మెంట్కు అనుమతినిస్తూ అమెరికా సెనెట్‌లో అధికార డెమొక్రాట్లు, రిపబ్లికన్లు అంగీకారానికి వచ్చారు. ఈ నెలాఖరులోగా డిఫాల్ట్ సమస్యను ఎదుర్కొనే పరిస్థితిని నివారించేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.
ఈ సంగతిని సెనెట్ మెజారిటీ లీడర్ చుక్ స్కుమర్ గురువారం వెల్లడించారు. రుణ పరపతిపై సీలింగ్ పొడిగించడానికి ఈ ఒప్పందానికి వచ్చామన్నారు. శుక్రవారం లోగా అమెరికా సెనెట్ దీనికి ఆమోదం తెలుపుతుందని భావిస్తున్నారు.
ప్రస్తుతం 28.4 ట్రిలియన్ల డాలర్ల వరకు మాత్రమే రుణాల సేకరణకు అధికారం ఉంది. ఈ నేపథ్యంలో రుణ పరిమితిని పెంచేందుకు చేసిన తీర్మానానికి సెనెట్, చట్టసభ ప్రతినిధుల సభ ఆమోదం తెలిపితే అమెరికా రుణ పరిమితి 28.9 ట్రిలియన్ డాలర్లకు పెరుగుతుందని సెనెట్ వర్గాలు చెప్పాయి. 2022 చివరిలోగా రుణ పరిమితి పెంచడానికి డెమొక్రాట్లు చేసిన ప్రయత్నాన్ని రిపబ్లికన్లు అడ్డుకున్నారు.
Read Today's Latest News News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం
Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి
Samsung Galaxy F70 5G | రూ.17,999కే శాంసంగ్ 5జీ ఫోన్.. 50MP కెమెరా, 5000mAh బ్యాటరీతో వచ్చేసింది!
Black Deer | కుర్సియాంగ్ అడవుల్లో మరో నల్లజింక ప్రత్యక్షం.. పరవశించిన పర్యాటకులు..!
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!

