CSK vs LSG : సొంతగడ్డపై చెన్నై సూపర్ కింగ్స్ కుర్రాడు ఉర్విల్ పటేల్(42 నాటౌట్) సిక్సర్లతో రెచ్చిపోతున్నాడు. డేంజరస్ ఓపెనర్ సంజూ శాంసన్(28) ఔటైనా.. లక్నో సూపర్ జెయింట్స్ బౌలర్ల భరతం పడుతూ బంతిని స్టాండ్స్‌లోకి పంపిస్తున్నాడు. అవేశ్ ఖాన్, దిగ్వేశ్ రథీ ఓవర్లో రెచ్చిపోయిన ఈ చిచ్చరపిడుగు.. సిక్సర్లు, ఫోర్లతో విరుచుకుపడ్డాడు. చూస్తుంటే ఐపీఎల్లో రికార్డు అర్ధ శతకం బాదేసేలా ఉన్నాడీ హిట్టర్. ఉర్విల్ విధ్వంసానికి కుదేలైన లక్నో బౌలర్లు ఆరు ఓవర్లకే 97 రన్స్ ఇచ్చుకున్నారు.
భారీ ఛేదనలో ధాటిగా ఆడుతున్న శాంసన్(28)ను దిగ్వేశ్ రథీ బౌల్డ్ చేసి తొలి వికెట్ అందించాడు. అవేశ్ ఖాన్‌ను వణికించిన ఉర్విల్ పటేల్(42 నాటౌట్) చివరి మూడు బంతుల్ని స్టాండ్స్‌లోకి పంపగా 5 ఓవర్లకే చెన్నై స్కోర్ డెబ్బై దాటింది. ఆ తర్వాతి ఓవర్లో దిగ్వేష్‌ను వదలని ఉర్విల్.. మూడు సిక్సర్లు, ఒక ఫోర్‌తో స్టేడియాన్ని హోరెత్తించాడు. వరసగా రెండు ఓవర్లలో 25 చొప్పున రన్స్ రావడంతో పవర్ ప్లేలో సీఎస్కే వికెట్ నష్టానికి 97 పరుగులు చేసింది. కెప్టెన్ రుతురాజ్ గైక్వాడ్ 26 పరుగులతో ఆడుతున్నాడు.
The perfect response after being hit for a six \|/
🎥 Digvesh Rathi 𝗖𝗔𝗦𝗧𝗟𝗘𝗦 Sanju Samson 🔥
Updates ▶️ https://t.co/MoXhlWHk4O#TATAIPL | #KhelBindaas | #CSKvLSG | @LucknowIPL pic.twitter.com/qHvEIdVpRS
— IndianPremierLeague (@IPL) May 10, 2026