CSK vs LSG | అర్ధశతకంతో రెచ్చిపోయిన ఇంగ్లిస్.. చెన్నై ముందు భారీ లక్ష్యం..!
CSK vs LSG : పంతొమ్మిదో సీజన్లో ప్లే ఆఫ్స్ రేసులో లేని లక్నో సూపర్ జెయింట్స్(LSG) భారీ స్కోర్ కొట్టింది. ఓపెనర్ జోష్ ఇంగ్లిస్(85) అర్ధ శతకంతో భారీ స్కోర్‌కు పునాది వేశాడు.
CSK vs LSG : పంతొమ్మిదో సీజన్లో ప్లే ఆఫ్స్ రేసులో లేని లక్నో సూపర్ జెయింట్స్(LSG) భారీ స్కోర్ కొట్టింది. ఓపెనర్ జోష్ ఇంగ్లిస్(85) అర్ధ శతకంతో భారీ స్కోర్‌కు పునాది వేశాడు. కానీ, ఓవర్టన్(3-36), అన్షుల్ కంబోజ్(2-47)లు వికెట్ల వేటతో మిడిలార్డర్‌కు బ్రేకులు వేశారు. షాదాబ్ అహ్మద్(43 నాటౌట్), హిమ్మత్ సింగ్(17) డెత్ ఓవర్లలో ధనాధన్ ఆడి స్కోర్ రెండొందలు దాటించారు. ఒకదశలో 230 ప్లస్ కొట్టేలా కనిపించినా చివరకు వీరిద్దరి కృషి ఫలితంగా లక్నో 203కు పరిమితమైంది.
చెపాక్ స్టేడియంలో టాస్ ఓడిన లక్నోకు ఓపెనర్ జోష్ ఇంగ్లిస్(85) అదిరే ఆరంభమిచ్చాడు. మిచెల్ మార్ష్(10), పూరన్(1)లు విఫలమైనా..పవర్ హిట్టింగ్తో చెన్నై సూపర్ కింగ్స్ బౌలర్లకు చుక్కలు చూపిన ఇంగ్లిస్ 17 బంతుల్లోనే అర్ధ శతకంతో కదం తొక్కాడు. అతడి ధాటికి రాకెట్లా లక్నో స్కోర్ పరుగులు పెట్టింది. అయితే.. భారీ స్కోర్ దిశగా సాగుతున్న లక్నోను ఓవర్టన్ దెబ్బకొట్టాడు. పదో ఓవర్లో డేంజరస్ ఇంగ్లిస్, రిషభ్ పంత్(15)ను ఔట్ చేసి లక్నో స్కోర్ వేగానికి బ్రేకులు వేశాడు.
Forget the textbook, Josh is teaching his own Inglis 😉
An innovative 1️⃣7️⃣-ball FIFTY for #LSG opener 👏
Updates ▶️ https://t.co/MoXhlWHk4O#TATAIPL | #KhelBindaas | #CSKvLSG | @LucknowIPL pic.twitter.com/iYVn9iT5W5
— IndianPremierLeague (@IPL) May 10, 2026
షాదాబ్ ధనాధన్
ఓవర్టన్ విజృంభణతో 77/1తో పటిష్ట స్థితిలో ఉన్న లక్నో.. ఒక్కసారిగా తడబడింది. మర్క్రమ్(6), రఘువంశీ(18)లు త్వరగానే ఔటైనా.. షాదాబ్ అహ్మద్(47 నాటౌట్) నిలబడ్డాడు. ఓవర్టన్ వేసిన 19వ ఓవర్లో రెచ్చిపోయిన ఈ లెఫ్ట్ హ్యాండర్ 4, 6, 4 కొట్టాడు. హిమ్మత్ సింగ్(17)తో కలిసి షాదాబ్ ఏడో వికెట్ అర్ధ శతకం భాగస్వామ్యం నమోదు చేశాడు. కంబోజ్ వేసిన చివరి ఓవర్లో ఆఖరి బంతిని షాదాబ్ సిక్సర్‌గా మలవగా లక్నో స్కోర్ రెండొందలు దాటింది. ఫలితంగా.. లక్నో నిర్ణీత ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 203 పరుగులు చేయగలిగింది.
Punching back with a solid stand 👊🤝
Shahbaz Ahmed and Himmat Singh propel #LSG with a quality 5️⃣0️⃣-run partnership 📈
Updates ▶️ https://t.co/MoXhlWHk4O#TATAIPL | #KhelBindaas | #CSKvLSG | @LucknowIPL pic.twitter.com/M5SVSVpMNk
— IndianPremierLeague (@IPL) May 10, 2026
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Nobel Prize: ఆర్థికశాస్త్రంలో ఇద్దరికి ఈయేటి నోబెల్ పురస్కారం
Thyroid Problem | థైరాయిడ్ సమస్య ఉన్నవారికి రోబోటిక్ శస్త్ర చికిత్స ఉపయోగకరమేనా.. నిపుణులు ఏమంటున్నారు..?
‘నాంపల్లిని కరువు మండలంగా ప్రకటించాలి’
Mayor Reservations | ఏపీలో మేయర్ స్థానాలకు రిజర్వేషన్లు ఖరారు చేస్తూ ఉత్తర్వులు
Jobs | నేవల్ డాక్‌యార్డ్, ఎయిర్‌క్రాఫ్ట్ యార్డ్‌లో 210 అప్రెంటిస్ ఖాళీలు
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

