Boat explosion | చార్టర్ బోటులో భారీ పేలుడు.. 11 మందికి గాయాలు
Boat explosion | అమెరికా (USA) లోని ఫ్లోరిడా రాష్ట్రం (Florida state) లో ఓ చార్టర్ బోటు (Charter Boat) లో భారీ పేలుడు సంభవించింది. మియామి నగర సమీపంలోని బిస్కేన్ బేలో శనివారం ఈ దుర్ఘటన చోటుచేసుకుంది. ప్రమాదంలో ఒక చిన్నారితో సహా 11 మంది గాయపడ్డారు. పర్యాటకానికి ప్రసిద్ధి చెందిన హాలోవర్ సాండ్బార్ సమీపంలో ఈ ఘటన జరిగింది.
Boat explosion : అమెరికా (USA) లోని ఫ్లోరిడా రాష్ట్రం (Florida state) లో ఓ చార్టర్ బోటు (Charter Boat) లో భారీ పేలుడు సంభవించింది. మియామి నగర సమీపంలోని బిస్కేన్ బేలో శనివారం ఈ దుర్ఘటన చోటుచేసుకుంది. ప్రమాదంలో ఒక చిన్నారితో సహా 11 మంది గాయపడ్డారు. పర్యాటకానికి ప్రసిద్ధి చెందిన హాలోవర్ సాండ్బార్ సమీపంలో ఈ ఘటన జరిగింది. ‘నాటీ నేబర్స్’ అనే 40 అడుగుల పడవలో సుమారు 14 మంది ప్రయాణిస్తుండగా ఒక్కసారిగా పేలుడు సంభవించింది. ఈ ధాటికి బోటులో ఉన్న ప్రయాణికులు గాల్లోకి ఎగిరి నీటిలో పడ్డారు.
సమాచారం అందుకున్న వెంటనే మియామి-డేడ్ ఫైర్ రెస్క్యూ, యూఎస్ కోస్ట్ గార్డ్ బృందాలు ఘటనా స్థలానికి చేరుకున్నాయి. ప్రమాద తీవ్రత దృష్ట్యా దీనిని ‘లెవెల్ 2 మాస్ క్యాజువాలిటీ’గా ప్రకటించి సహాయక చర్యలు చేపట్టారు. గాయపడిన వారిలో కొందరికి తీవ్రంగా కాలిన గాయాలు కాగా.. మరికొందరికి స్వల్ప గాయాలయ్యాయని అధికారులు తెలిపారు. బోటు ఇంజిన్ను స్టార్ట్ చేసే సమయంలో గ్యాస్ లీక్ కావడం వల్లే ఈ పేలుడు జరిగి ఉండవచ్చని ప్రాథమికంగా భావిస్తున్నారు.
బోటు కెప్టెన్ తొందరపడి భద్రతా నిబంధనల ప్రకారం బ్లోయర్లను ఆన్ చేయకుండానే ఇంజిన్ స్టార్ట్ చేయడం వల్లే ఈ ప్రమాదం జరిగిందని ఒక ప్రత్యక్ష సాక్షి ఆరోపించారు. ప్రస్తుతం ఈ ఘటనపై ఫ్లోరిడా ఫిష్ అండ్ వైల్డ్లైఫ్ కన్జర్వేషన్ కమిషన్ ప్రధాన దర్యాప్తు సంస్థగా వ్యవహరిస్తుండగా.. యూఎస్ కోస్ట్ గార్డ్ కూడా సమాంతరంగా విచారణ జరుపుతోంది. పూర్తి దర్యాప్తు తర్వాతే పేలుడుకు కచ్చితమైన కారణాలు తెలుస్తాయని అధికారులు తెలిపారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్

