చర్లపల్లి, నవంబర్ 3 : బీఆర్ఎస్ ప్రభుత్వంలోనే ఉప్పల్ అన్ని రంగాల్లో అభివృద్ధి సాధించిందని, ఎన్నికల్లో బీఆర్ఎస్ను గెలిపిస్తే మరింత అభివృద్ధి చేసేందుకు కృషి చేస్తానని ఉప్పల్ నియోజకవర్గం బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి బండారి లక్ష్మారెడ్డి అన్నారు. చర్లపల్లి, మహాలక్ష్మినగర్‌లోని అజీజియా మసీద్ వద్ద కార్పొరేటర్ బొంతు శ్రీదేవి ఆధ్వర్యంలో ప్రత్యేక సమావేశం నిర్వహించి ఉప్పల్ నియోజకవర్గం బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి బండారి లక్ష్మారెడ్డికి ముస్లిం మత పెద్దలు మద్దతు ప్రకటించి ప్రచారం నిర్వహించారు. మాజీ కార్పొరేటర్ గొల్లూరి అంజయ్య, ముస్లిం మత పెద్దలు రియాజ్, యాకుబ్, సయ్యద్ సులేమాన్, ఏజాజ్, హమీద్, అసీఫ్, వజీద్, అరీఫ్, బీఆర్ఎస్ నాయకులు నాగిళ్ల బాల్‌రెడ్డి, నేమూరి మహేశ్‌గౌడ్, పాండాల శివకుమార్‌గౌడ్, కనకరాజుగౌడ్, హరినాథ్, బొడిగె ప్రభుగౌడ్, నారెడ్డి రాజేశ్వర్‌రెడ్డి, గిరిబాబు, జాండ్ల ప్రభాకర్‌రెడ్డి, ఎంకిరాల నర్సింహ, లక్ష్మారెడ్డి, కడియాల యాదగిరి, కొమ్ము రమేశ్, సానెం రాజుగౌడ్, కొమ్ము సురేశ్, కడియాల బాబు, సోమయ్య, రాధాకృష్ణ పాల్గొన్నారు.
మల్లాపూర్ డివిజన్ పరిధిలో…
మల్లాపూర్, నవంబర్ 3 : ఉప్పల్ నియోజకవర్గం బీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థి బండారి లక్ష్మారెడ్డిని భారీ మెజార్టీతో గెలిపించుకుంటామని కార్పొరేటర్ పన్నాల దేవేందర్‌రెడ్డి తెలిపారు.
రామంతాపూర్ డివిజన్లో..
రామంతాపూర్, నవంబర్ 3 : బండారి లక్ష్మారెడ్డి ని గెలిపిస్తామని రామంతాపూర్ డివిజన్లో పలు కాలనీల ప్రజలు పేర్కొంటున్నారని మాజీ కార్పొరేటర్ గంధం జ్యోత్స్న నాగేశ్వర్రావు తెలిపారు. నాయకులు శ్రీనివాస్‌రెడ్డి,మధుసూదన్‌రెడ్డి,చాంద్‌పాష, బోసాని పవన్‌కుమార్,సుధాకర్,ఆవుల బాబు, మహేందర్‌యాదవ్, శ్రీశైలం యాదవ్,మల్లేశ్‌యాదవ్,ఆకాశ్‌యాదవ్,తదితరులు పాల్గొన్నారు.
చర్లపల్లి డివిజన్లో..
చర్లపల్లి, నవంబర్ 3 : చర్లపల్లి డివిజన్ నుంచి బీఆర్ఎస్ అభ్యర్థి బండారి లక్ష్మారెడ్డికి అత్యధిక మెజారిటీ అందించేందుకు ప్రచారాన్ని ముమ్మరం చేశామని డివిజన్ కార్పొరేటర్ బొంతు శ్రీదేవి పేర్కొన్నారు.మాజీ కార్పొరేటర్ ధన్‌పాల్‌రెడ్డి, నాయకులు నాగిళ్ల బాల్‌రెడ్డి, నేమూరి మహేశ్‌గౌడ్, పాండాల శివకుమార్‌గౌడ్, కనకరాజుగౌడ్, బొడిగె ప్రభుగౌడ్, నారెడ్డి రాజేశ్వర్‌రెడ్డి, సారా అనిల్, జయకృష్ణ, జాండ్ల సత్తిరెడ్డి, తాళ్ల వెంకటేశ్‌గౌడ్, శ్రీకాంత్‌రెడ్డి, లక్ష్మారెడ్డి, కడియాల యాదగిరి, కొమ్ము రమేశ్, సానెం రాజుగౌడ్, కడియాల బాబు, దాసరి కనకయ్య, కొమ్ము సురేశ్, ఆనంద్రాజుగౌడ్, రెడ్డినాయక్, రాఘవరెడ్డి, వెంకట్‌రెడ్డి, నజీర్, పుష్పలత, అలీ, బాల్‌నర్సింహ, నవనీత, సత్తెమ్మ, లలిత, సోమయ్య, లక్ష్మీనారాయణ, ముత్యాలులతో పాటు పెద్ద సంఖ్యలో కాలనీవాసులు తదితరులు పాల్గొన్నారు.
ఏఎస్‌రావునగర్ డివిజన్ పరిధిలోని శ్రీనగర్ కాలనీలో బీఆర్ఎస్ అభ్యర్థి బండారి లక్ష్మారెడ్డికి మద్దతుగా బీఆర్ఎస్ నాయకులు నుంచి ప్రచారం చేశారు. బీఆర్ఎస్ డివిజన్ నాయకులు బేతాల బాల్‌రాజు, శేర్ మణెమ్మ, సుదర్శన్‌రెడ్డి, మురళీ పంతులు, లక్ష్మీనారాయణ, గొలి శ్రీనివాస్, శంకర్, రహీ ం,మల్కా రామాదేవి, సజ్జ రామతులసీ, శోభారాణి, దుర్గా, శ్రీనివాస్‌గౌడ్, కృష్ణ, బసవయ్య, గోవర్ధ న్, రాజిరెడ్డి, యాక య్య, సింగం రాజు ల కార్యకర్తలు, పాల్గొన్నారు.