Viral news : ఓ పెళ్లి వేడుక (Wedding ceremony) లో రోటీ మేకర్ (Roti maker) జుగుప్స కలిగించే పనిచేశాడు. రోటీల తయారీకి నీటిని చేతితో చల్లడానికి బదులుగా.. పుక్కిటపట్టి ఉమ్ముతూ రోటీలు వేశాడు. ఈ ఘటనను వీడియో తీసిన ఓ వ్యక్తి సోషల్ మీడియా (Social Media) లో పెట్టడంతో వైరల్గా మారింది. దాంతో పోలీసులు దర్యాప్తు చేపట్టి, నిందితుడి గుర్తించి అదుపులోకి తీసుకున్నారు.
ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని బులంద్ షహర్లో తాజా ఓ విహహ వేడుక జరిగింది. ఈ వేడుకలో రోటీలు తయారు చేయడానికి వచ్చిన దనిష్.. రోటీలపై ఉమ్ముతూ తయారు చేశాడు. ఈ తతంగాన్ని వీడియో తీసిన ఓ వ్యక్తి దాన్ని సోషల్ మీడియాలో షేర్ చేశాడు. దాంతో ఆ వీడియో వైరల్గా మారింది. ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు.
దనిష్ను గుర్తించి అరెస్ట్ చేశారు. కాగా ఉత్తరప్రదేశ్లో రోటీలపై ఉమ్ముతూ వ్యక్తులు అరెస్ట్ కావడం ఇదే తొలిసారి కాదు. గతంలో కూడా పలు సందర్భాల్లో ఇలాంటి ఘటనలు చోటుచేసుకున్నాయి. గత ఆగస్టులో కూడా బాఘ్పట్లో ఓ వ్యక్తి ఇలాగే ఉమ్ముతూ రోటీలు వేసి కటకటాల వెనక్కి వెళ్లాడు. గత మే నెలలో కూడా మీరట్లో ఓ వ్యక్తి ఉమ్ముతూ రోటీలు చేసి అరెస్టయ్యాడు.