హైదరాబాద్, సెప్టెంబర్ 29 (నమస్తే తెలంగాణ): అత్యంత కట్టుదిట్టమైన మూ డంచెల భద్రత ఉండే సచివాలయం లోపలికి నిరసనకారులు వరుసగా రెండో రోజు చొచ్చుకొనిపోయి, నేరుగా ఉప ముఖ్యమంత్రి, ఆర్థిక శాఖ మంత్రి మల్లు భట్టివిక్రమార చాంబర్ ఎదుటే బైఠాయించి ధర్నాకు దిగడం సచివాలయ వర్గాల్లో తీవ్ర ప్రకంపనలు సృష్టించింది. 20 నెలలుగా వేతనం అందక ఆకలితో అలమటిస్తున్నామని, ప్రభుత్వం వెంటనే స్పందించి తమ బకాయిలను విడుదల చేయాలని సుమారు 4,500 మంది పార్ట్‌టైమ్ స్వీపర్లు, పారిశుధ్య కార్మికుల తరఫున ప్రతినిధులు మంగళవారం మధ్యాహ్నం సచివాలయంలోని రెండో అంతస్తులో ఉన్న డి ప్యూటీ సీఎం కార్యాలయం వద్ద నిరసన తెలిపారు. రాష్ట్రంలోని వివిధ ప్రభుత్వ కార్యాలయాలు, పాఠశాలలు, వసతిగృహాలు, సంస్థల్లో ఎన్నో ఏండ్లుగా పార్ట్‌టై మ్ స్వీపర్లు, సావెంజర్లుగా పనిచేస్తున్నతమకు ప్రభుత్వం నెలకు ఇచ్చేది రూ.5,200 మాత్రమేనని, 20 నెలలుగా చెల్లించడం లేదని ఆందోళనకు దిగారు.
ఒకో కార్మికుడికి నెలకు రూ.5,200 చొప్పున 20 నెలలకుగాను ఒకొకరికి రూ.1,04,000 చొప్పున ప్రభుత్వం బకాయిపడిందని స్వీపర్లు తెలిపారు. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న సుమారు 4,500 మందికి కలిపి రూ.46-రూ.47 కోట్ల వరకు విడుదల కావాల్సి ఉన్నదని పేర్కొన్నారు. ఇప్పటికే ప్రజాభవన్‌కు వెళ్లి ఎన్నోసార్లు అర్జీలు సమర్పించామని, మంత్రుల కాళ్లావేళ్లా పడినా ఫలితం లేదని వాపోయారు. సీఎం, డిప్యూటీ సీఎంను కలుద్దా మంటే అపాయింట్మెంట్ కూడా ద కడం లేదని, గత్యంతరం లేకే డిప్యూటీ సీఎం చాంబర్ వద్దకు వచ్చి నిరసన చేపట్టాల్సి వచ్చిందని చెప్పారు. రెండో అంతస్తులో భట్టి చాంబర్ వద్ద కార్మికులు బైఠాయించడంతో అప్రమత్తమైన భద్రతా సిబ్బంది వారిని బలవంతంగా అడ్డుకోవడానికి ప్రయత్నించగా ఇరువర్గాల మధ్య తీవ్ర వాగ్వాదం చోటుచేసుకున్నది.
సచివాలయంలో వరుస పరిణామాలు పరిపాలన, భద్రతాపరమైన ప్రశ్నలను తె రపైకి తెస్తున్నాయి. మూడంచెల భద్రతా వలయం, మెటల్ డిటెక్టర్లు, వందలాది మంది ప్రత్యేక భద్రతా సిబ్బంది పహారా కాసే సెక్రటేరియట్‌లోకి బయటి వ్యక్తులు గంపగుత్తగా ప్రవేశించి రెండోసారి ధర్నా లు చేయడం అధికార వర్గాలను విస్మయానికి గురిచేస్తున్నది. అంతకుముందు రోజే సోమవారం పెండింగ్ బిల్లుల కోసం రిటై ర్డ్ ఉద్యోగులు, చిరు కాంట్రాక్టర్లు ఇదే చాంబర్ వద్ద ఆందోళన చేశారు.
సాధారణ రోజుల్లో ప్రజలు వినతిపత్రా లు ఇచ్చేందుకు సచివాలయం గేట్ల వద్దకు వస్తే అకడి పోలీసులు వ్యవహరించే తీరు పై ఎప్పటినుంచో ప్రజల్లో తీవ్ర అసంతృప్తి నెలకొని ఉన్నది. సామాన్యులు వస్తే విజిటర్స్ పాస్ అడిగే సచివాలయ పోలీసు కా నిస్టేబుళ్లు తమ వ్యక్తిగత సెల్ఫోన్లలో ఫొ టోలు తీస్తూ, రకరకాల ప్రశ్నలు వేసి, ము ప్పుతిప్పలు పెడుతారనే ఆరోపణలు ఉ న్నాయి. అయితే తాజా ఘటన వెనుక పోలీసు యంత్రాంగం నిఘా వైఫల్యం దాగి ఉన్నదా? లేక ఉద్దేశపూర్వకంగా రచ్చ జరిగేలా ఎవరైనా చేశారా సందేహా లు వ్యక్తమవుతున్నాయి.
20 నెలలుగా 4వేల మంది స్వీపర్లకు జీతాలు చెల్లించకపోవడం దుర్మార్గమని బీఆర్ఎస్ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ హరీశ్‌రావు ఆగ్రహం వ్యక్తంచేశారు. ‘ఒకటో తారీఖునే ఉద్యోగులందరికీ జీతాలు ఇస్తున్నామని చెప్పుకొంటున్న సీఎం రేవంత్‌రెడ్డి గారూ, ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార గారూ.. ఇదేనా మీరు ఒకటో తారీఖున జీతాలు ఇవ్వడమంటే?’ అని ఎద్దేవా చేశారు. అతి తక్కు వ వేతనాలతో కష్టపడి పనిచేసే పారిశుధ్య కార్మికుల పట్ల ప్రభుత్వం ఇంతటి నిర్లక్ష్యం ప్రదర్శించడం అన్యాయమని మండిపడ్డారు. ప్రభుత్వం తక్షణమే బకాయిలన్నింటినీ విడుదల చేయాలని ‘ఎక్స్’లో డిమాండ్ చేశారు.