జూన్ 1 నుంచి లాక్డౌన్ ఎత్తివేతకు నిర్ణయం
వచ్చే నెల ఒకటో తేదీ నుంచి లాక్డౌన్ ఎత్తివేతకు మధ్యప్రదేశ్ ప్రభుత్వం నిర్ణయించింది. తొలుత ఉజ్జయినిలో అన్‌లాక్ మొదలవుతుందని ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ సూచనాప్రాయంగా ఈ విషయాన్ని వెల్లడించారు

భోపాల్ : వచ్చే నెల ఒకటో తేదీ నుంచి లాక్డౌన్ ఎత్తివేతకు మధ్యప్రదేశ్ ప్రభుత్వం నిర్ణయించింది. తొలుత ఉజ్జయినిలో అన్‌లాక్ మొదలవుతుందని ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ సూచనాప్రాయంగా ఈ విషయాన్ని వెల్లడించారు. బుధవారం ఉజ్జయిని చేరుకున్న ముఖ్యమంత్రి చౌహాన్.. ఈ నెల 31 వరకు కఠినమైన లాక్డౌన్ ఉంటుందని చెప్పారు. జూన్ 1 నుంచి జిల్లాలు క్రమంగా తెరుస్తారని తెలిపారు.
పరిమిత సంఖ్యలో వివాహ వేడుకలకు అనుమతించేలా మార్గదర్శకాలు సిద్ధం చేస్తున్నారు. థర్డ్ వేవ్ ను సమర్థంగా ఎదుర్కొనేందుకు ప్రజలను సన్నద్ధం చేయడానికి ప్రణాళికలు మొదలుపెడుతున్నారు. కరోనా మహమ్మారి పరిస్థితిలను ఉజ్జయినిలో ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌమాన్ సమీక్ష జరిపారు. సమావేశంలో బ్లాక్ ఫంగస్ గురించి ఆందోళన వ్యక్తం చేశారు. బ్లాక్ ఫంగస్‌కు చికిత్స చేయడానికి ఉపయోగించే మందులను ప్రభుత్వం ఏర్పాటు చేస్తుందని తెలిపారు. రాష్ట్రంలో బ్లాక్ ఫంగస్ కు గురైన రోగులకు మంచి చికిత్స అందించాలని ఆదేశించారు. కరోనా కర్ఫ్యూను వచ్చే నెల 31 వరకు 11 రోజులు కఠినంగా అమలు చేయాలని సూచించారు. రాష్ట్రంలో కరోనా ఇన్ఫెక్షన్ కేసులు నెమ్మదిస్తున్నాయని, అలాగే డిశ్చార్జి అవుతున్న వారి సంఖ్య కూడా పెరుగుతుండటం పట్ల సంతోషం వ్యక్తం చేశారు. అనాథ చిన్నారులను ఆదుకునేందుకు జిల్లాల కలెక్టర్లు జాబితాలు సిద్ధం చేయాలని, అలాగే, తల్లిదండ్రులను కోల్పోయిన కుటుంబాలను ఆదుకునేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.
ఇవి కూడా చదవండి..
పాలస్తీనాకు అన్ని రకాల సాయం: పాక్ నిర్ణయం
మరో చిప్కో ఉద్యమం.. ఎంపీలో ‘సేవ్ బక్స్వాహా ఫారెస్ట్’
బ్రిటన్ అన్‌లాక్ : కలకలలాడుతున్న ఎయిర్‌పోర్ట్స్, రెస్టారెంట్స్
పిల్లలపై వ్యాక్సిన్ ట్రయల్స్ నిలిపివేయాలన్న పిటిషన్ తోసివేత
నటి మెర్కెల్‌ను వివాహమాడిన ప్రిన్స్ హ్యారీ.. చరిత్రలో ఈరోజు
బట్లర్ ఆల్‌టైమ్ ఐపీఎల్ XI లో ధోనీ, కోహ్లీ, శర్మకు చోటు
కోడి మెదళ్లు తిన్నా.. 111 ఏండ్లు బతికున్నా..!
కన్నారం పిల్లోడు.. ‘ట్రేస్ చాట్’ కనిపెట్టిండు..!
తాజా వార్తల కోసం నమస్తే తెలంగాణ ఫేస్బుక్ , ట్విటర్, టెలిగ్రామ్ ను ఫాలో అవండి..
Read Today's Latest News News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Elon Musk | అమెరికాలో ప్రతి చిన్నారికి SpaceX షేర్ ఇస్తా.. ఎలాన్ మస్క్ సంచలన ప్రకటన!
Akhilesh Yadav | బీజేపీ కుట్రపూరితంగా విపక్షాలను ఓట్లను తొలగిస్తున్నది : అఖిలేష్ యాదవ్
Dasoju Sravan | ఎల్‌నినో సంక్షోభం ప్రకృతి వైపరిత్యం కాదు.. కాంగ్రెస్ ప్రభుత్వ అసమర్థతే.. 23 ప్రశ్నలతో దాసోజు శ్రవణ్ బహిరంగ లేఖ
Osteoporoses | చిన్న వయసులోనే ఎముకల బలంపై శ్రద్ధ.. ఆస్టియోపోరోసిస్ ముప్పును తగ్గించుకోండిలా..
Ganja Seized | వాహనాల తనిఖీలో ఐదు కిలోల గంజాయి స్వాధీనం..భార్యభర్తల అరెస్ట్
ట్రెండింగ్ వార్తలు
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం
Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి
Samsung Galaxy F70 5G | రూ.17,999కే శాంసంగ్ 5జీ ఫోన్.. 50MP కెమెరా, 5000mAh బ్యాటరీతో వచ్చేసింది!
Black Deer | కుర్సియాంగ్ అడవుల్లో మరో నల్లజింక ప్రత్యక్షం.. పరవశించిన పర్యాటకులు..!
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!

