గురుగ్రామ్: యూట్యూబర్, గతం లో బిగ్ బాస్ విన్నర్ ఎల్విష్ యాదవ్ ఇంటిపై గుర్తు తెలియని వ్యక్తులు కాల్పులు జరిపారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం, ఆదివారం ఉదయం 5.30 గంటల నుంచి 6 గంటల మధ్య బైక్‌లపై వచ్చిన ముగ్గురు వ్యక్తులు ఎల్విష్ యాదవ్ ఇంటిపైకి విచక్షణారహితంగా కాల్పు లు జరిపారు. గ్రౌండ్ ఫ్లోర్, మొదటి అంతస్థులపైకి దాదాపు రెండు డజన్ల తూటాలను పేల్చినప్పటికీ, ఎవరూ గాయపడలేదు. నిందితులు వెంటనే తప్పించుకుని పారిపోయారు. సంఘటన సమయంలో యాదవ్ ఇంట్లో లేరు. కేర్‌టేకర్ మాత్రమే ఆ ప్రాంగణంలో ఉన్నారు. అయితే, యాదవ్ రెండో అంతస్థు, మూడో అంతస్థుల్లో ఉంటారని తెలుస్తున్నది.
కుక్కల స్వైర విహారం ; పరిగిలో 16, కొడంగల్‌లో ఆరుగురికి కుక్కకాటు
పరిగి/కొడంగల్, ఆగస్టు 17 : వికారాబాద్ జిల్లాలో ఆదివారం వీధి కుక్కలు స్వైర విహారం చేశాయి. పరిగిలో 16 మంది, కొడంగల్‌లో ఆరుగురిని కరిచాయి. పరిగి మున్సిపల్ పరిధిలో 16 మందిని కరువగా వారిని స్థానిక ప్రభుత్వ దవాఖానకు తీసుకెళ్లారు. విషయం తెలుసుకున్న బీఆర్ఎస్ నాయకులు దవాఖానకు వెళ్లి మందుల విషయమై డాక్టర్‌ను అడగ్గా తమ వద్ద అందుబాటులో లేవని చెప్పడంతో మండిపడ్డారు. పరిగి నుంచి తాండూరు దవాఖానకు వెళ్లగా అక్కడా మందులు లేకపోగా బీఆర్ఎస్ నాయకులు వికారాబాద్ దవాఖానలో బాధితులకు వైద్యం చేయించారు. కొడంగల్‌లో మున్సిపల్ ఆఫీస్ సమీపంలో ఆదివారం ఓ వీధి కుక్క ఆరుగురిపై దాడి చేసింది. ఒకరికి స్థానిక ప్రభుత్వ దవాఖానలో చికిత్స చేయించగా, మిగతా వారిని హైదరాబాద్‌కు తీసుకెళ్లారు. అధికారులు ఇప్పటికైనా స్పందించి వీధి కుక్కల బెడద నుంచి కాపాడాలని ప్రజలు కోరుతున్నారు.