KTR | ఎత్తిపోతల పథకం టెండర్లలోనూ మంత్రి పొంగులేటి కంపెనీకి అనుచిత లబ్ధి : కేటీఆర్
KTR | కోడంగల్-నారాయణపేట-మక్తల్ ఎత్తిపోతల పథకం టెండర్లలోనూ మంత్రి పొంగులేటి కంపెనీకి అనుచిత లబ్ధి చేకూర్చారని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆరోపించారు.
హైదరాబాద్ : కోడంగల్-నారాయణపేట-మక్తల్ ఎత్తిపోతల పథకం ( Lift Irrigation ) టెండర్లలోనూ మంత్రి పొంగులేటి ( Minister Ponguletis ) కంపెనీకి అనుచిత లబ్ధి చేకూర్చారని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ( KTR ) సోషల్ మీడియా వేదిక ద్వారా ఆరోపించారు. మంత్రి పొంగులేటి సొంత కంపెనీ టెండర్లలో పాల్గొని, మిగతా కంపెనీలన్నీ నామమాత్రపు పోటీదారులేనని విమర్శించారు.
రూ.1,450 కోట్ల నుంచి రూ.6,825 కోట్లకు పెరిగిన ప్రాజెక్టు వ్యయాన్ని పెంచారని పేర్కొన్నా రు. ఎత్తిపోతల పథకం కింద ఉన్న రైతాంగానికి చుక్క నీరు అందకముందే అంచనా వ్యయా న్ని ఐదు రెట్లకు పెంచారని వెల్లడించారు. ట్యాంకర్ల కోసం ప్రజలు ఎదురుచూస్తుంటే ప్రాజెక్టుల పేరుతో తెలంగాణ సంపదను దోపిడీ చేస్తున్నారని విమర్శిం చారు.
2014లో సుమారు రూ.1,450 కోట్లుగా ఉన్న ప్రాజెక్టు వ్యయం ప్రస్తుతం రూ.6,825 కోట్లకు చేరిందని పేర్కొన్నారు. ప్రాజెక్టు నిర్మాణం పేరుతో అంచనా వ్యయాన్ని భారీగా పెంచుతూ, టెండర్ల ప్రక్రియను కూడా తమకు అనుకూలంగా మార్చుకుంటున్నారని కేటీఆర్ ఆరోపించారు. టెండర్లలో పారదర్శకతకు తావులేకుండా, తమకు అనుకూలమైన కంపెనీలకే పనులు దక్కేలా వ్యవస్థను ఏర్పాటు చేసుకున్నారని మండిపడ్డారు.
ప్రజల అవసరాలకు ప్రాధాన్యత ఇవ్వకుండా, ప్రాజెక్టుల అంచనా వ్యయాలను పెంచి కాంట్రాక్టుల ద్వారా లబ్ధి పొందే ప్రయత్నం చేస్తున్నారని విమర్శించారు. కాంగ్రెస్‌కు క్రోనీ క్యాపిటలిజం, బహిరంగ దోపిడీ అనే పదాలు కూడా సరిపోవని అన్నారు.ఈ వ్యవహారంపై కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ స్పందించి, ఇలాంటి దోపిడీకి సరిపోయే కొత్త పదాన్ని సూచించాలని వ్యంగ్యంగా వ్యాఖ్యానించారు. ప్రాజెక్టుల పేరుతో ప్రజాధనాన్ని ఖర్చు చేస్తూ, టెండర్ల ప్రక్రియలోనూ తమకు అనుకూలమైన కంపెనీలకే ప్రయోజనం చేకూర్చే కాంగ్రెస్ ప్రభుత్వ విధానాన్ని కేటీఆర్ తీవ్రంగా తప్పుబట్టారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
TB | టీబీ వ్యాధికి ఇక ఒకే ఒక్క ఇంజెక్షన్ చాలు.. సన్నాహాలు చేస్తున్న ప్రపంచ ఆరోగ్య సంస్థ..
KTR | ఎత్తిపోతల పథకం టెండర్లలోనూ మంత్రి పొంగులేటి కంపెనీకి అనుచిత లబ్ధి : కేటీఆర్
ఉపాధి కోసం ఆంధ్రా వెళ్లిన వ్యక్తి ప్రమాదవశాత్తు మృతి
Student | అమీర్‌పేటలో హోటల్ మేనేజ్మెంట్ విద్యార్థి ఆత్మహత్య..!
మోటకొండూర్‌లో రెండు ఇసుక ట్రాక్టర్లు పట్టివేత
ట్రెండింగ్ వార్తలు
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video
Watch: శివసేన నేత ఇంట్లో డ్రగ్స్ ఉంచిన పోలీస్ అధికారి.. తర్వాత ఏం జరిగిందంటే?
Viral news | ఆ ఇంట్లో రోజూ నాగుపాముల కలకలం.. ఏడ వెతికినా పాము గుడ్లే..!
Viral News | అనారోగ్యంతో ఉన్న అమ్మకోసం కేంద్ర మాజీ మంత్రి వేణుగానం..!

