Under-19 World Cup Heroes : పురుషుల అండర్ -19 వన్డే ప్రపంచకప్ విజేత భారత జట్టు సగర్వంగా స్వదేశంలో అడుగుపెట్టింది. ఆరోసారి రికార్డు టైటిల్‌తో యావత్ భారతావని గర్వపడేలా చేసిన ఆయుశ్ మాత్రే (Ayush Mhatre) బృందం ఆదివారం ముంబై విమానాశ్రయంలో దిగింది. జగజ్జేతలుగా తిరిగొచ్చిన టీమిండియా క్రికెటర్లకు కుటుంబ సభ్యులు, ఎయిర్పోర్ట్ సిబ్బంది, అభిమానులు ఘన స్వాగతం పలికారు. సొంతగడ్డపై తమను ఘనంగా ఆహ్వానించడంపై యువ క్రికెటర్లు ఆనందంతో ఉబ్బితబ్బిబ్బయ్యారు.
అండర్ -19 ఛాంపియన్లుగా స్వదేశం విచ్చేసిన భారత క్రికెటర్లను చూసి కుటుంబసభ్యులు పొంగిపోయారు. టీమిండియా విజయంలో కీలకమైన కెప్టెన్ ఆయుశ్ మాత్రే, వైభవ్ సూర్యవంశీ, అభిగ్యాన్ కుందు, హెనిల్ పటేల్ ముంబై విమానాశ్రయం చేరుకున్నారు. వారిని చూసేందుకు మీడియా, అభిమానులు భారీగా తరలి వచ్చారు. ఈ సందర్భంగా.. మీడియావాళ్లైతే విశ్వవిజేతలను మాట్లాడించేందుకు పోటీపడ్డారు.
#WATCH | Mumbai | A member of India’s Under-19 World Cup–winning team, Abhigyan Abhishek Kundu says, “We are feeling very happy and winning the World Cup for India…” https://t.co/RBaGfcyc8A pic.twitter.com/PxrlSNpk62
— ANI (@ANI) February 8, 2026
#WATCH | Mumbai | A member of India’s Under-19 World Cup–winning team, Henil Patel, says, “The mindset of the team was to win the World Cup for the nation… My aim is to play for the senior Indian team” https://t.co/RBaGfcyc8A pic.twitter.com/VTQjoNpEaZ
— ANI (@ANI) February 8, 2026
పేసర్ హెనిల్ పటేల్ మాట్లాడుతూ.. దేశం కోసం వరల్డ్‌కప్ గెలవాలని అందరం లక్ష్యంగా పెట్టుకున్నాం. అనుకున్నట్టే సాధించాం. నా తదుపరి లక్ష్యం సీనియర్ జట్టుకు ఆడడమే అని చెప్పాడు. వికెట్ కీపర్ అభిగ్యాన్ కుందు స్పందిస్తూ.. ప్రపంచకప్ గెలిచినందుకు తమకు ఎంతో గర్వంగా ఉందని అన్నాడు. ఇక కెప్టెన్ ఆయుష్ మాత్రే తండ్రి యోగేశ్ కమలాకర్ మాత్రే పట్టలేనంత సంతోషంగా ఉందన్నాడు. అండర్-19 ప్రంపచకప్ గెలుపొందడం ద్వారా ఆయుశ్ దేశమంతా గర్వపడేలా చేశాడు అని ఆయన పేర్కొన్నాడు.
#WATCH | Mumbai | Yogesh Kamlakar Mhatre, father of Captain Ayush Mhatre says, “Ayush has made the entire nation proud by winning the ICC Under-19 Cricket World Cup and bringing the trophy home…” https://t.co/RBaGfcyc8A pic.twitter.com/96h1IWHk0R
— ANI (@ANI) February 8, 2026
జింబాబ్వే, నమీబియా వేదికగా జరిగిన పురుషుల అండర్ -19 ప్రపంచకప్‌లో భారత జట్టు విజేతగా నిలిచింది. ఏకపక్షంగా సాగిన ఫైనల్లో వైభవ్ సూర్యవంశీ(175) పిడుగల్లే విరుచుకుపడగా.. కెప్టెన్ ఆయుశ్ మాత్రే(53), అభిగ్యాన్ కుందు(40)లు చెలరేగారు. ఆఖర్లో కనిష్క్ చౌహన్(37 నాటౌట్) మెరుపులతో 411 రన్స్ కొట్టిన టీమిండియా.. అనంతరం ప్రత్యర్ధిని 311కే కట్టడి చేసింది. అంబ్రిష్(3-56), కనిష్క్(2-63), దీపేశ్(2-64) అద్బుతమైన బౌలింగ్‌తో ఇంగ్లండ్ ఆశలపై నీళ్లు చల్లారు. వంద పరుగుల తేడాతో నెగ్గిన భారత్.. రికార్డు స్థాయిలో ఆరోసారి ట్రోఫీని అందుకుంది.