ముంబై: ఉమ్రాన్ మాలిక్ యార్కర్లకు ఇరగదీస్తున్నాడు. గుజరాత్ టైటాన్స్‌తో జరిగిన మ్యాచ్‌లో తన స్పీడ్‌తో యమ హీటెక్కించాడు. బ్యాటర్లను ముప్పుతిప్పలు పెట్టించాడు. గుజరాత్ ఓపెనర్ వృద్ధిమాన్ సాహాను .. హైదరాబాద్ పేసర్ ఉమ్రాన్ క్లీన్ బౌల్డ్ చేశాడు. భారీ షాట్లతో అలరిస్తున్న సాహాకు.. ఉమ్రాన్ తన యార్కర్‌తో బ్రేకేశాడు. 153 కిలోమీటర్ల వేగంతో వచ్చిన ఆ బంతికి సాహా క్లీన్ బౌల్డ్ అయ్యాడు. ఐపీఎల్ చరిత్రలోనే ఇది అత్యంత స్పీడ్ బాల్ అని నిర్వాహకులు చెబుతున్నారు. నిజానికి ఆ హోరాహోరీ పోరులో సన్‌రైజర్స్ ఓడినా.. ఆ సూపర్ స్పీడ్ డెలివరీని మీరూ చూడాల్సిందే. ఆ స్టన్నింగ్ యార్కర్ వీడియో ఇదే.