శివకార్తికేయన్ కథానాయకుడిగా అనుదీప్ కెవీ (‘జాతి రత్నాలు’ ఫేమ్) దర్శకత్వంలో తెలుగు, తమిళ భాషల్లో ఓ చిత్రం రూపొందుతున్న విషయం తెలిసిందే. నారాయణ్‌దాస్ నారంగ్, పుస్కూర్ రామ్మోహన్ రావు, సురేష్ బాబు నిర్మాతలు. ఈ సినిమాలో కథానాయికగా ఉక్రేనియన్ సుందరి మరియా ర్యాబోషప్క ఎంపికైంది. ఈ విషయాన్ని సోమవారం వెల్లడించారు. ఈ సందర్భంగా ఆమె పోస్టర్‌ను విడుదల చేశారు. ‘మరియా ఇప్పటికే రెండు ఉక్రెయిన్ చిత్రాల్లో నటించింది. ఓ భారతీయ వెబ్‌సిరీస్‌లో ప్రధాన పాత్రను పోషించింది. విభిన్నమైన కాన్సెప్ట్‌తో రొమాంటిక్ ఎంటర్టైనర్గా ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నాం. పాండిచ్చేరి, లండన్ నేపథ్యంలో కథ నడుస్తుంది’ అని చిత్రబృందం తెలిపింది. ఈ చిత్రానికి తమన్ సంగీతాన్నందిస్తున్నారు.