హైదరాబాద్, అక్టోబర్ 26: ప్రభుత్వరంగ సంస్థ యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (యూబీఐ).. గృహ రుణాలు తీసుకునేవారికి శుభవార్తను అందించింది. ఈ రుణాలపై వడ్డీరేటును 6.40 శాతానికి తగ్గించింది. ఈ నూతన రేట్లు బుధవారం నుంచి అమలులోకి రానున్నట్లు ఒక ప్రకటనలో వెల్లడించింది. ప్రస్తుతం దేశవ్యాప్తంగా అందిస్తున్న గృహ రుణాల్లో వడ్డీరేటు ఇదే తక్కువది కావడం విశేషం. ఈ నూతన వడ్డీరేట్లు నూతనంగా గృహ రుణం తీసుకునేవారికి లేదా పాత ఖాతాదారులకు కూడా వర్తించనున్నాయి. ఈ పండుగ సీజన్లో ఖాతాదారులకు ఆర్థికంగా ప్రయోజనం కల్పించాలనే ఉద్దేశంతో పాటు గృహ రుణాలకు మరింత డిమాండ్ తీసుకురావడానికి బ్యాంక్ ఈ నిర్ణయం తీసుకున్నది.