రసాయన పరిశ్రమలో గ్యాస్ లీకై ఇద్దరి మృతి
రసాయన పరిశ్రమలో క్లోరోఫామ్ లీకై ఇద్దరు దుర్మరణం పాలయ్యారు. మరో ఆరుగురు కార్మికులు అస్వస్థతకు గురయ్యారు. ఈ ఘటన సంగారెడ్డి జిల్లా జిన్నారం మండలం గడ్డపోతారంలోని సరాకా ల్యాబొరేటరీస్ లిమిటెడ్ పరిశ్రమలో గురువారం రాత్రి జరిగింది. తోటి కార్మికులు, యాజమాన్యం, పోలీసుల కథనం ప్రకారం..
- మరో ఆరుగురు కార్మికులకు అస్వస్థత
- గడ్డపోతారం పారిశ్రామిక వాడలోని సరాకాలో ఘటన
హైదరాబాద్ సిటీబ్యూరో/హైదరాబాద్/జిన్నారం, అక్టోబర్ 23 : రసాయన పరిశ్రమలో క్లోరోఫామ్ లీకై ఇద్దరు దుర్మరణం పాలయ్యారు. మరో ఆరుగురు కార్మికులు అస్వస్థతకు గురయ్యారు. ఈ ఘటన సంగారెడ్డి జిల్లా జిన్నారం మండలం గడ్డపోతారంలోని సరాకా ల్యాబొరేటరీస్ లిమిటెడ్ పరిశ్రమలో గురువారం రాత్రి జరిగింది. తోటి కార్మికులు, యాజమాన్యం, పోలీసుల కథనం ప్రకారం.. శ్రీకాకుళం జిల్లాకు చెందిన పంగ సుదర్శన్‌రావు(38), విజయనగరం జిల్లాకు చెందిన కిలపర్తి బాలాజీ(29) గడ్డపోతారం పారిశ్రామికవాడలోని సరాకా ల్యాబొరేటరీస్ పరిశ్రమలో షిఫ్ట్ ఇన్చార్జులుగా పని చేస్తున్నారు. గురువారం రాత్రి ప్రొడక్షన్ యూనిట్-2 బ్లాక్‌లో విధులు నిర్వహిస్తున్న సమయంలో ఒక్కసారిగా క్లోరోఫాం పైప్‌లైన్ లీక్ కావడంతో ఘాటు వాసనలు వెలువడ్డాయి. ఆ సమయంలో బ్లాకులో 20 మంది వరకు కార్మికులు ఉన్నారు. సుదర్శన్‌రావు, బాలాజీ లీకేజీకి సమీపంలో ఉండటంతో శ్వాస ఆడక పడిపోయారు. ఆపరేటర్ గోక ప్రసాద్‌రావు, సూపర్వైజర్లు అసిరెడ్డి కృష్ణారెడ్డి, నిమ్న గణేశ్, హెల్పర్ పొచ్చిరెడ్డి యుగంధర్, ట్రైనర్లు రవితున్, వెన్న అన్వేష్‌రెడ్డి స్వల్ప అస్వస్థతకు గురయ్యారు. గ్యాస్ లీకైన విషయాన్ని గమనించిన మిగిలిన కార్మికులు బయటకు పరుగులు తీశారు.
సుదర్శన్‌రావు, బాలాజీని దవాఖానకు తరలించగా అప్పటికే మృతిచెందినట్టు వైద్యులు ప్రకటించారు. మృతుల కుటుంబీకుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు జిన్నారం సీఐ నాగార్జునగౌడ్ తెలిపారు. పటాన్చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్‌రెడ్డి శుక్రవారం ఘటనా స్థలాన్ని సందర్శించారు. యాజమాన్యంతో చర్చించి మృతుల కుటుంబాలకు రూ.70 లక్షల చొప్పున పరిహారం ఇచ్చేందుకు ఒప్పించారు. కాలుష్య నియంత్రణ మండలి ఘటనపై స్పందించి సరాకా ల్యాబొరేటరీస్ పరిశ్రమను మూసేయాలని, పరిశ్రమకు విద్యుత్ సరఫరా నిలిపేయాలని టీజీఎస్పీడీసీఎల్ అధికారులకు ఆదేశాలు జారీ చేసింది. గ్యాస్ లీకేజీతో ఇద్దరు కార్మికులు మరణించడంపై బీఆర్ఎస్ఎల్పీ డిప్యూటీ లీడర్, మాజీ మంత్రి హరీశ్‌రావు ఆవేదన వ్యక్తంచేశారు. మృతుల కుటుంబాలకు శుక్రవారం ‘ఎక్స్’ వేదికగా సానుభూతి ప్రకటించారు. మృతుల కుటుంబాలకు రూ. కోటి చొప్పున పరిహారం ఇవ్వాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.‘దుర్ఘటనలు జరిగిన తర్వాత వచ్చి ఫొటోలకు పోజులు ఇవ్వడం తప్ప.. కార్మికుల ప్రాణాలకు భరోసా కల్పించేందుకు ప్రభుత్వం చేస్తున్నదేంది? భద్రతా ప్రమాణాలను గాలికొదిలి కార్మికుల ప్రాణాలతో చెలగాటమాడుతున్న పరిశ్రమల యాజమాన్యాలపై కఠిన చర్యలు తీసుకునేదెప్పుడు?’ అని ప్రశ్నించారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

