లఖింపుర్ఖేరి: బదిలీ చేశారన్న కోపంతో ఇద్దరు టీచర్లు 24 మంది అమ్మాయిల్ని లాకప్ చేశారు. ఈ ఘటన యూపీలోని లఖింపురి ఖేరి జిల్లాలో జరిగింది. కస్తూర్బా గాంధీ బాలికా విద్యాలయ స్కూల్కు చెందిన అమ్మాయిల్ని ఆ స్కూల్ పైకప్పుపై బంధించారు. జిల్లా అధికారులపై వత్తిడి తెచ్చేందుకు ఆ టీచర్లు ఇలా చేశారు. బదిలీలు రద్దు చేయాలని కోరారు. గురువారం రాత్రి ఈ ఘటన జరిగింది. అయితే జోక్యం చేసుకున్న పోలీసులు ఆ తర్వాత పిల్లల్ని హాస్టల్కు తీసుకువచ్చారు. హాస్టల్ వార్డెన్ లలిత్ కుమారి ఇచ్చిన ఫిర్యాదు మేరకు విద్యార్థినులను జిల్లా అధికారులు కాపాడారు.