న్యూఢిల్లీ: మహారాష్ట్ర, పంజాబ్లలో పెరిగిపోతున్న కరోనా కేసులు ఆందోళన కలిగిస్తున్నాయని అన్నారు కేంద్ర ఆరోగ్య శాఖ కార్యదర్శి రాజేష్ భూషణ్. గత 24 గంటలలోనే మహారాష్ట్రలో 28 వేల కేసులు నమోదైనట్లు ఆయన చెప్పారు. అటు పంజాబ్ జనాభా లెక్కల ప్రకారం చూసుకుంటే అక్కడి కేసులు చాలా ఎక్కువ అని భూషణ్ అన్నారు. ఇక దేశంలో పది జిల్లాల్లో పరిస్థితి ఆందోళనకరంగా ఉండగా.. అందులో 9 జిల్లాలు మహారాష్ట్రకే చెందినవి కావడం గమనార్హం. పుణె, నాగపూర్, ముంబై, థానె, నాసిక్, ఔరంగాబాద్, నాందేడ్, జల్గావ్, అకోలాలతోపాటు కర్ణాటకలోని బెంగళూరు అర్బన్ జిల్లాల్లో కేసులు చాలా ఎక్కువగా ఉన్నట్లు ఆయన వెల్లడించారు.