సింగపూర్: ఇద్దరు భారతీయులు ఓ విలువైన వజ్రాన్ని(Diamond) చోరీ చేశారు. సింగపూర్‌లోని చైనాటౌన్‌లో ఉన్న ఓ షాపు నుంచి ఆ డైమండ్‌ను దొంగలించారు. మార్కెట్ ప్రకారం దాని విలువ సుమారు లక్షన్నర డాలర్లు ఉన్నది. అయితే నోట్లో పెట్టుకుని అసలు వజ్రాన్ని కాజేసిన ఆ ఇద్దర్నీ ఎయిర్‌పోర్టులో సింగపూర్ పోలీసులు పట్టుకున్నారు. వారికి శిక్షను ఖరారు చేశారు. 41 ఏల్ల మంగ్రోలియా మనోజ్‌కుమార్ కుర్జీబాయ్కి రెండేళ్ల జైలుశిక్ష పడింది. అతనితో కలిసి 30 ఏళ్ల సెరసియా మిలన్ రామినిక్భాయ్ కూడా దొంగతనం చేశాడు.
ఓ మీడియా కథనం ప్రకారం.. 4.95 క్యారెట్లు ఉన్న డైమండ్‌ను పోలిన ఓ నకిలీ వజ్రాన్ని తయారు చేశారు. సూరత్‌లో ఆ డమ్మీ వజ్రాన్ని తయారు చేసి సింగపూర్‌కు వెళ్లారు. అక్కడ షాపులోకి వెళ్లేముందు నోటిలో పెట్టుకుని నకిలీ వజ్రాన్ని తీసుకెళ్లారు. షాపింగ్ పేరుతో ఆ షాపులో ఉద్యోగుల్ని మాటల్లో పెట్టారు. ఆ తర్వాత అసలైన వజ్రాన్ని బయటకు తీయించారు. మంగ్రోలియా అనే వ్యక్తి సేల్స్ మేనేజర్‌ను కంట్రోల్ చేశాడు. ఇక మిలన్ అనే వ్యక్తి తన నోట్లో ఉన్న నకిలీ వజ్రాన్ని తీసి.. అసల వజ్రాన్ని కాజేశాడు.
షాపు నుంచి వెల్లేముందు తన నోట్లు అసలు డైమెండ్‌ను పెట్టుకుని వెళ్లిపోయాడు. జూలై 19వ తేదీన ఆ వజ్రంతో పరారీ అయ్యేందుకు సింగపూర్‌లోని చాంగీ ఎయిర్‌పోర్టుకు చేరుకున్నారు. కానీ ఈలోగా షాపులోని నిజమైన వజ్రం మాయమైనట్లు ఉద్యోగులు గుర్తించారు. చాంగీ ఎయిర్‌పోర్టు టర్మినల్ 3 వద్ద ఇమ్మిగ్రేషన్ క్లియరెన్స్ కోసం ఎదురుచూస్తున్న సమయంలో ఆ ఇద్దర్నీ అరెస్టు చేశారు. మిలాన్ లెదర్ బ్యాగు నుంచి అసలు వజ్రాన్ని స్వాధీనం చేసుకున్నారు. స్థానిక కోర్టు ఇద్దరు భారతీయులకు శిక్షను ఖరారు చేసింది.