సుల్తానాబాద్, జూలై 29 : పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ బాలసదన్ నుంచి ఇద్దరు బాలికలు పరారైనట్టు సీఐ రంజిత్‌రావు, ఎస్సై చంద్రకుమార్ తెలిపారు. పెద్దపల్లి మండలం పాలితం గ్రామానికి చెందిన ఉమామహేశ్వరి , ఓదెల మండలం ఉప్పరపల్లికి చెందిన ఆకృతి బుధవారం తెల్లవారుజామున హాస్టల్ గోడ దూకి తమ బ్యాగులతో పరారైనట్టు సీసీ కెమెరాల ఆధారంగా బహిర్గతం అయిందని చెప్పారు.
ఉమామహేశ్వరి మూడు రోజుల క్రితమే హాస్టల్‌కు వచ్చినట్టు తెలిపారు. హాస్టల్ సూపరింటెండెంట్ వనిత పిర్యాదు మేరకు దర్యాప్తు చేస్తున్నట్టు వెల్లడించారు. బాలికలు ఎక్కడైనా కనిపిస్తే 8712656511, 8712656510 సెల్ఫోన్లకు సమాచారం అందించాలని కోరారు.