పశ్చిమ బెంగాల్లో ఇద్దరు మాజీ పోలీసుల ‘టగ్ ఆఫ్ వార్’

కోల్‌కతా: త్వరలో జరుగనున్న పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికలకు అన్ని పార్టీలు వ్యూహప్రతివ్యూహాలు రచిస్తున్నాయి, ఎవరికి వారే గెలుపుపై ధీమాతో ఉండి అభ్యర్థులను ఎంపిక చేస్తున్నారు. ఇప్పటికే 291 మందితో పూర్తిస్థాయి జాబితాను టీఎంసీ అధినేత మమతా బెనర్జీ ప్రకటించగా.. బీజేపీ 57 మందితో తొలిజాబితాను విడుదల చేసింది. నంద్రిగ్రామ్ నుంచి బరిలో దిగుతున్నట్లు మమతా బెనర్జీ ఇప్పటికే ప్రకటించగా.. అక్కడి నుంచి సువేందు అధికారిని అభ్యర్థిగా ప్రకటించి బీజేపీ అసెంబ్లీ ఎన్నికలను మరింత రక్తికట్టిస్తున్నాది. ఈ క్రమంలో వెస్ట్ మిడ్నాపూర్ జిల్లాలో ఆసక్తికర ఘట్టం చోటుచేసుకుంటున్నది.
వెస్ట్ మిడ్నిపూర్ జిల్లా పరిధిలోని దేబ్రా నియోజకవర్గం నుంచి ఇద్దరు మాజీ పోలీసు అధికారులు బరిలో నిలిచారు. ఒకరు తృణమూల్ కాంగ్రెస్ అభ్యర్థి మాజీ ఐపీఎస్ అధికారి హుమాయూన్ కబీర్ ఉండగా.. మరొకరు బీజేపీ తరఫున మాజీ ఐపీఎస్ అధికారి భారతీ ఘోష్ బరిలో నిలిచారు. హుమాయూన్ కబీర్ చందన్నగర్ పోలీసు కమిషనర్‌గా పనిచేసి గత నెలలో పదవికి రాజీనామా చేసి టీఎంసీలో చేరారు. ముగ్గురు బీజేపీ నాయకులను అదుపులోకి తీసుకున్నప్పుడు గోలీమారో అంటూ అరిచి వార్తల్లో వ్యక్తిగా కబీర్ నిలిచారు. అనంతరం పోలీస్ కమిషనర్ పదవికి రాజీనామా చేశారు. దేబ్రా నియోజకవర్గం నుంచి హుమాయూన్ కబీర్‌ను మమత అభ్యర్థిగా ప్రకటించడంతో.. బీజేపీ కూడా తామేమీ తక్కువ తినలేదన్నట్లుగా మాజీ ఐపీఎస్ అధికారి భారతీ ఘోష్ అభ్యర్థిత్వాన్ని ఖరారు చేసింది. భారతీ ఘోష్ ఇంతకుముందు ఝార్గ్రామ్ జిల్లా ఎస్పీగా పనిచేశారు. మమతా బెనర్జీతో చాలా సన్నిహితంగా ఉన్న భారతీ ఘోష్.. ఓ బహిరంగసభలో అమ్మా అంటూ సంభోదించారు. 2019 లోక్‌సభ ఎన్నికల సమయంలో బీజేపీలో చేరారు.
Read Today's Latest News News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Yaba Tablets | అస్సాంలో రూ.10 కోట్ల విలువైన డ్రగ్స్ పట్టివేత..!
Indian Army launches Bharat Rice | రక్షణ దళాల కోసం ‘భారత్ రైస్’.. ఎఫ్‌సీఐతో ఆర్మీ ఒప్పందం
Ganja Chocolates | కరీంనగర్ జిల్లాలో గంజాయి చాక్లెట్స్ కలకలం
Rahul Gandhi | ఓట్ల దొంగతనంలో సీఈసీ ప్రధాన నేరస్థుడు కాదు : రాహుల్‌గాంధీ
Infections | శరీరంలో ఇన్ఫెక్షన్లు తీవ్రమైతే కనిపించే లక్షణాలు ఇవే.. వీటితో జాగ్రత్త..
ట్రెండింగ్ వార్తలు
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?

