Moinabad | డ్రగ్స్ తరలిస్తున్న ఇద్దరు అరెస్ట్.. 2 లక్షల విలువైన ఎండీఎంఏ స్వాధీనం..!
మొయినాబాద్, అక్టోబర్ 10: అక్రమంగా మారకద్రవ్యాలను తరలిస్తున్న ఇద్దరు యువకులను ఎస్ఓటి, షాబాద్ పోలీసులు అరెస్టు చేశారు. నిందితుల నుంచి రూ.2 లక్షలు విలువైన ఎండిఎంఏ మాదకద్రవ్యాన్ని(13.97 గ్రాములు), మూడు సెల్ ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు.
మొయినాబాద్, అక్టోబర్ 10: అక్రమంగా మారకద్రవ్యాలను తరలిస్తున్న ఇద్దరు యువకులను ఎస్ఓటి, షాబాద్ పోలీసులు అరెస్టు చేశారు. నిందితుల నుంచి రూ.2 లక్షలు విలువైన ఎండిఎంఏ మాదకద్రవ్యాన్ని(13.97 గ్రాములు), మూడు సెల్ ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు. అనంతరం నిందితులను రిమాండ్‌కు తరలించారు. డ్రగ్స్ సరఫరా కేసుకు సంబంధించిన వివరాలను చేవెళ్ల జోన్ డీసీపీ కార్యాలయంలో శనివారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో డీసీపీ యోగేష్ గౌతమ్ వెల్లడించారు.
చేవెళ్ల ఎస్ఓటీ, షాదాబ్ పోలీసులు సంయుక్తంగా చేపట్టిన ఆపరేషన్‌లో ఇద్దరు యువకులు డ్రగ్స్‌తో పట్టుబడ్డారు. వారిని శంకర్పల్లి మండలం మిర్జాగూడలోని ఇంద్రారెడ్డి నగర్ కాలనీకి చెందిన మారం వంశీ రెడ్డి, బీరా ప్రవీణ్ కుమార్‌గా గుర్తించారు. వీరిద్దరు తరచుగా బెంగుళూరు నుంచి మాదక ద్రవ్యాలు తీసుకొచ్చి శంకరపల్లి, మోకిలా, కోకాపేట్, నానక్‌రాం గూడ ప్రాంతాల్లో విద్యార్థులు, సాఫ్ట్వేర్ ఉద్యోగులకు విక్రయిస్తుంటారు. ఇదే క్రమంలో శుక్రవారం వంశీ రెడ్డి, ప్రవీణ్ కుమార్ ఎండీఎంఏ డ్రగ్స్‌ను తరలిస్తూ షాబాద్ మండలంలోని నాగర్ కుంట చౌరస్తాలోని టీ టైం వద్ద ఆగారు. చేవెళ్ల జోన్ ఎస్ఓటి బృందం, షాబాద్ పోలీసులు సమన్వయంతో వ్యవహరించి క్లూస్ టీం సహకారంతో వీరిని పట్టుకున్నారు. రాత్రి 8:45 గంటలకు సాక్షుల సమక్షంలో వీరు నేరాన్ని అంగీకరించారు. నిందితుల నుంచి ఎండిఎంఏ మాదకద్రవ్యం 13.97 గ్రాములు, రూ. 3,500 నగదు, రెడ్మీ (Redmi) 5జీ మొబైల్ ఫోన్, కత్తిని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.
అనంతరం విచారణలో డ్రగ్స్ సరఫరాలో మహమ్మద్ సోహైల్, మహమ్మద్ అజార్ అలియాస్ అస్లామ్లతో సహా మరికొందరు వ్యక్తులకు ఇందులో ప్రమేయం ఉన్నట్లు వంశీ రెడ్డి, బీరా ప్రవీణ్ తెలిపారు. దాంతో, మిగిలిన నిందితులను గుర్తించడానికి, దొంగిలించబడిన సొత్తును స్వాధీనం చేసుకోవడానికి పోలీసు బృందాలు రంగంలోకి దిగాయి. చేవెళ్ల ఏసీపీ బి. కిసాన్ నిర్దేశనంలో ఐపీఎస్ యోగేష్ గౌతమ్ పర్యవేక్షణలో శంకర్పల్లి పోలీస్ స్టేషన్ ఎస్హెచ్ఓ (SHO) జి. రుద్రవీర్, చేవెళ్ల డివిజన్ డిటెక్టివ్ ఇన్స్పెక్టర్ ఎల్. సమరం రెడ్డి, మోకిలా క్రైమ్ బృందం ఈ ఆపరేషన్‌ను నిర్వహించారు.
రూ. 42 వేలకు కొనుగోలు
షాబాద్ సీఐ లక్ష్మీరెడ్డి, పోలీసులు చేపట్టిన ప్రాథమిక విచారణలో బెంగళూరులోని స్టీఫెన్ అనే వ్యక్తి వద్ద నుంచి తీసుకొచ్చిన ఎండిఎంఏ గ్రాము ధర రూ. 3 వేలు ఉంటుందని నిందితులు తెలిపారు. సుమారుగా 14 గ్రాముల ఎండిఎంఏను వంశీ రెడ్డి, ప్రవీణ్‌లు రూ. 42 వేలకు కొనుగోలు చేసినట్లు పోలీసులు వెల్లడించారు. ‘ఈ కేసులో స్టీఫెన్ అనే వ్యక్తి పాత్ర పై దర్యాప్తు చేస్తున్నాం. అతడి ఆచూకీ గుర్తించి చట్టం ప్రకారము తదుపరి చర్యలు తీసుకుంటాం. నిందితులపై ఎన్డీపీఎస్ చట్టం ప్రకారం కేసు నమోదు చేశాం. ఇద్దరిని అదుపులోకి తీసుకొని రిమాండ్‌కు తరలించాం’ అని డీసీపీ యోగేష్ గౌతమ్ పేర్కొన్నారు. యువత భవిష్యత్తును నాశనం చేసే మాదకద్రవ్యాల అక్రమ రవాణా, విక్రయాలపై పోలీసులు నిరంతరం నిఘా కొనసాగిస్తున్నారని ఈ సందర్భంగా ఆయన తెలిపారు. మాదక ద్రవ్యాలను తరలించే యువకులను అరెస్టు చేసి, రిమాండ్‌కు తరలించిన సీఐ లక్ష్మీరెడ్డి, పోలీసు సిబ్బంది, చేవెళ్ల జోన్ ఎస్ఓటి టీంను అభినందించిన డీసీపీ కేసును ఛేదించిన పోలీసులకు రివార్డ్ ప్రకటించారు.
Read Today's Latest Rangareddy News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
AH Movie | ‘అ’ ఒక సరికొత్త మిస్టరీ థ్రిల్లర్: ప్రేక్షకులను ఉత్కంఠకు గురిచేయడం ఖాయమన్న హీరో రాహుల్ విజయ్!
Moinabad | డ్రగ్స్ తరలిస్తున్న ఇద్దరు అరెస్ట్.. 2 లక్షల విలువైన ఎండీఎంఏ స్వాధీనం..!
Auto Draft
Karepalli | కారేపల్లి మండలంలో ఘనంగా ‘ఎంగిలిపూల బతుకమ్మ’ వేడుకలు..!
Hanumakonda | విజయ డెయిరీ అభివృద్ధి కోసం రూ.1.85 కోట్ల నిధులు మంజూరు..!
ట్రెండింగ్ వార్తలు
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?

