AH Movie | ‘అ’ ఒక సరికొత్త మిస్టరీ థ్రిల్లర్: ప్రేక్షకులను ఉత్కంఠకు గురిచేయడం ఖాయమన్న హీరో రాహుల్ విజయ్!
Rahul Vijay | రాహుల్ విజయ్ మరియు అర్చన అయ్యర్ ప్రధాన తారాగణంగా, సాయి బాలి దర్శకత్వంలో తెరకెక్కుతున్న సస్పెన్స్ ఇన్వెస్టిగేషన్ డ్రామా థ్రిల్లర్ 'అ' (AH).
రాహుల్ విజయ్ మరియు అర్చన అయ్యర్ ప్రధాన తారాగణంగా, సాయి బాలి దర్శకత్వంలో తెరకెక్కుతున్న సస్పెన్స్ ఇన్వెస్టిగేషన్ డ్రామా థ్రిల్లర్ ‘అ’ (AH). స్టార్ బాక్స్ స్టూడియోస్, రిపుల్ స్లైడ్ స్టూడియోస్ బ్యానర్లపై కనకరావు తొనంగి, అభిషేక్ కె, ప్రముఖ ఎడిటర్ గ్యారీ బీహెచ్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రంపై ఇప్పటికే సినీ వర్గాలలో భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇటీవల విడుదలైన ‘బ్లడీ హంగర్’ గ్లింప్స్‌కు ప్రేక్షకుల నుంచి అద్భుతమైన స్పందన లభించగా, తాజాగా ఈ సినిమాలోని ‘ఇదేనా ఇదేనా’ లిరికల్ వీడియో సాంగ్ ఆవిష్కరణ కార్యక్రమం హైదరాబాద్‌లో అత్యంత వైభవంగా జరిగింది.
ఈ వేడుకలో శ్రీచరణ్ పాకాల అందించిన మధురమైన స్వరాలకు తోడు, షణ్ముఖ భరద్వాజ్ ఆలపించిన గాత్రం అందరినీ ఆకట్టుకుంది. సుమన్ చిక్కాల అందించిన అద్భుతమైన సాహిత్యంతో కూడిన ఈ పాటను పలువురు ప్రముఖ జర్నలిస్టులు ఆవిష్కరించారు. ఈ సందర్భంగా చిత్ర యూనిట్ సభ్యులు సినిమా విశేషాలను మీడియాతో పంచుకున్నారు.
టీమ్ మాటల్లో సినిమా విశేషాలు:
చిత్ర హీరో రాహుల్ విజయ్ మాట్లాడుతూ, ఈ సినిమాలో తాను ఒక సిన్సియర్ పోలీస్ ఆఫీసర్‌గా కనిపిస్తానని, ఇన్వెస్టిగేషన్ డ్రామాలో తన స్క్రీన్ ప్రెజెన్స్ ప్రేక్షకులను కట్టిపడేస్తుందని తెలిపారు. కేవలం డబ్బులు ఉంటే సరిపోదని, సినిమాపై ఎమోషన్ ఉన్న నిజమైన నిర్మాతలు వీరరని ప్రశంసించారు. శ్రీచరణ్ పాకాల సంగీతం ఈ చిత్రానికి బిగ్ అసెట్ అని, సినిమా మరింత మెరుగ్గా రావాలనే ఉద్దేశంతో అక్టోబర్ 30కి థియేట్రికల్ విడుదలను ప్లాన్ చేశామని స్పష్టం చేశారు. ‘అ’ మిస్టిరీయస్ ఇంట్రెస్టింగ్ ఇన్వెస్టిగేషన్ థ్రిల్లర్‌గా అందరికీ భీభత్సమైన థ్రిల్‌ను పంచుతుందని ధీమా వ్యక్తం చేశారు.
దర్శకుడు సాయి బాలి మాట్లాడుతూ, “అమ్మాయి, అదృశ్యం, అన్వేషణ, అనుమానం, అసాంఘీకం, అమానుషం అనే పదాల చుట్టూనే ఈ పూర్తి కథ తిరుగుతుంది. రాహుల్ విజయ్ ఎంతో క్రమశిక్షణ గల అద్భుతమైన నటుడు. నేను ఎంత ఇబ్బంది పెట్టినా ఎంతో సపోర్ట్ చేశారు. హీరోయిన్ అర్చన అయ్యర్ నటన సినిమాకే ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తుంది. నిర్మాతలు ఎక్కడా రాజీపడకుండా ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. పాటలతో పాటు శ్రీచరణ్ అందించిన బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ (BGM) సినిమాను వేరే లెవెల్‌కు తీసుకెళ్తుంది” అని వెల్లడించారు.
సంగీత దర్శకుడు శ్రీచరణ్ పాకాల మాట్లాడుతూ, తన కెరీర్లో ఈ సినిమా చాలా స్పెషల్ అని, ఫ్రెండ్స్ అందరూ కలిసి ఎంతో ప్యాషన్‌తో ఈ చిత్రాన్ని ప్రొడ్యూస్ చేశారని తెలిపారు. దర్శకుడు సాయి బాలి చూడటానికి చాలా సైలెంట్‌గా ఉంటారు కానీ, ఆయన తీసిన క్రైమ్ థ్రిల్లర్ చూస్తే మాత్రం అందరూ షాక్ అవ్వడం ఖాయమని చెప్పారు.
హీరోయిన్ అర్చన అయ్యర్ మాట్లాడుతూ, కెరీర్ ప్రారంభంలోనే ఇలాంటి ఇంటెన్స్ రోల్ చేయడం తన అదృష్టంగా భావిస్తున్నట్లు తెలిపారు. రాహుల్ విజయ్ గ్రేట్ కో-స్టార్ అని, ఈ సినిమాలోని ప్రతి పాత్ర ప్రేక్షకులకు సరికొత్త అనుభూతిని ఇస్తుందని పేర్కొన్నారు.
ఈ కార్యక్రమంలో నటుడు నరేష్, కో-ప్రొడ్యూసర్స్ అభినవ్ వి. కునపరెడ్డి, సింగర్ షణ్ముఖ్, లిరిసిస్ట్ సుమన్ తదితరులు పాల్గొన్నారు. మోనిష్ భూపతి రాజు సినిమాటోగ్రఫీ అందిస్తుండగా, అభినవ్ వి. కునపరెడ్డి మరియు గ్యారీ బీహెచ్ ఎడిటింగ్ బాధ్యతలు నిర్వహిస్తున్నారు. జాన్ విజయ్, సుదర్శన్, మిర్చి కిరణ్, బిత్తిరి సత్తి, దయానంద్ రెడ్డి తదితరులు నటిస్తున్న ఈ డార్క్ థ్రిల్లర్ అక్టోబర్ 30న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో గ్రాండ్‌గా విడుదల కానుంది.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
AH Movie | ‘అ’ ఒక సరికొత్త మిస్టరీ థ్రిల్లర్: ప్రేక్షకులను ఉత్కంఠకు గురిచేయడం ఖాయమన్న హీరో రాహుల్ విజయ్!
Moinabad | డ్రగ్స్ తరలిస్తున్న ఇద్దరు అరెస్ట్.. 2 లక్షల విలువైన ఎండీఎంఏ స్వాధీనం..!
Auto Draft
Karepalli | కారేపల్లి మండలంలో ఘనంగా ‘ఎంగిలిపూల బతుకమ్మ’ వేడుకలు..!
Hanumakonda | విజయ డెయిరీ అభివృద్ధి కోసం రూ.1.85 కోట్ల నిధులు మంజూరు..!
ట్రెండింగ్ వార్తలు
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?

